క్రికెట్ ఆట ఎన్నో భావోద్వేగాలతో కూడుకుని ఉంటుంది అనే విషయం తెలుసిందే . విజయ ఆటగాళ్లలో  ఉత్సాహాన్ని నింపడం... ఓటమి అదే ఆటగాళ్లలో నిరాశను నింపుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇలా మైదానంలో ఎన్నో భావోద్వేగ పూరితమైన ఘటనలు దర్శనమిస్తూ ఉంటాయి. ఏదైనా మ్యాచ్ లో గెలిచిన జట్టు సంబరాలు చేసుకోవడం ఎక్కువగా కెమెరాలలో చూపిస్తూ ఉంటారు. కానీ ఓడిపోయిన జట్టు ఎంత విచారం వ్యక్తం చేస్తుంది అనేది మాత్రం చాలా మటుకు చూపించారు. అయితే ఇలా ఓడిపోయిన జట్టు కాస్త బాధ పడడం గెలిచిన జట్టు గెలుపు సంబరాల్లో మునిగి పోవడం మైదానంలో సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. 

 


 కానీ జట్టు అపజయం పాలైనప్పటికీ ముఖంలో చెరగని చిరునవ్వుతో... క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉండే ఆటగాళ్లు క్రికెట్ ప్రేక్షకుల మనసును గెలుచుకుంటూ  ఉంటారు. ఇలా ఇలాంటి సమయంలో ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పే ఆటగాళ్ల లో ఒకరు కుమార సంగక్కర. 2011 ప్రపంచ కప్ లో ఓడిపోయినప్పటికీ కూడా తన ముఖంలో చిరునవ్వు మాత్రం బెదరలేదు. కుమార సంగక్కర క్రీడాస్ఫూర్తి కి అందరూ ఫిదా అయిపోయారు. 2011 వన్డే ప్రపంచకప్ కులశేఖర్ బౌలింగ్ ధోని సిక్సర్ కొట్టి మ్యాచ్ ని  గెలిపించిన తర్వాత యువరాజ్ ఎంతో భావోద్వేగ పూరితంగా పరుగులు పెడుతూ వచ్చి ధోనిని హత్తుకున్నా  విషయం తెలిసిందే. యువీ ధోనీ ఇద్దరు మైదానంలో సంబరాలు జరుపుకుంటూ ఉంటే కుమార సంగక్కర ఓటమి లో కూడా చిరునవ్వుతోనే అందరికీ సమాధానం ఇచ్చాడు. 

 


 ప్రపంచకప్లో ఓడిపోవడం అంటే అది ఎంతో బాధను కలిగిస్తుంది అన్న విషయం తెలిసిందే. అలాంటి బాధలో కూడా  క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ... శ్రీలంక క్రికెట్ అభిమానులతో పాటు యావత్ క్రీడా ప్రేక్షకులను ఫిదా చేశాడు కుమార సంగక్కర. అయితే ఆ  సంఘటన గురుంచి తాజాగా వెల్లడించారు. ఏ బాధ నుండి అయినా సరే త్వరగా కోలుకునే స్ఫూర్తి తన దేశం నేర్పిందని... ఎప్పుడు గెలుపు కోసం బరిలోకి దిగుతాం ... కానీ కొన్ని కొన్ని సార్లు ఓటమి దరి చేరినప్పుడు కూడా చిరునవ్వుతోనే పలకరించాలి అంటూ కుమార సంగక్కర చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 2011లో ప్రపంచ కప్ ఓడిపోవడం ఎంతగానో బాధ కలిగించిందని కానీ ఓడిపోయాము  కదా అని బాధపడుతూ కూర్చోకుండా తర్వాత ప్రపంచ కప్ గురించి ఆలోచించాలి కదా అంటూ సమాధానమిచ్చాడు కుమార సంగక్కర.

మరింత సమాచారం తెలుసుకోండి: