తాజాగా టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పై మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లులు కురిపించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ ప్రస్థానాన్ని తెలుపుతూ రోహిత్ ఎదిగిన తీరును ప్రధానంగా కొనియాడాడు. రోహిత్ శర్మకు ఎలాంటి ఒత్తిడి మ్యాచ్ అయినా సరే ఆడటం బాగా తెలుసు అంటూ రోహిత్ శర్మ గురించి తెలిపాడు. అంతేకాకుండా మ్యాచ్ పరిస్థితులను అంచనా వేస్తూ ఆడటంలో రోహిత్ దిట్ట అని తెలిపాడు. ఇకపోతే ఐపీఎల్ మొదటి సీజన్లో రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ కు ఆడిన సంగతిని ఆయన ప్రస్తావించాడు. 

 

నిజానికి రోహిత్ శర్మ ఒత్తిడిలో మ్యాచ్ లను యువకుడిగా ఉన్నప్పుడు నుంచే సమర్ధంగా ఆడుతున్నాడని తెలిపాడు. 2008 సంవత్సరంలో డెక్కన్ చార్జెస్ విజయాల్లో రోహిత్ ముఖ్య పాత్ర పోషించాడని తెలిపాడు. ఇకపోతే ఆ సమయంలోనే ఒక జట్టుకు సారథ్యం వహించే లక్షణాలను అతను అలవర్చుకున్నాడు అని తెలియజేశాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ ఒక యువ క్రికెటర్ మాత్రమే. అప్పుడు టి20 వరల్డ్ కప్ ఆడిన అనుభవం మాత్రమే అతనికి ఉంది. అంతేకాకుండా ఆ సీజన్ లో రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ లో తీవ్ర ఒత్తిడిలో అనేక మ్యాచ్లు ఆడాడు అని గుర్తు చేశాడు.


అప్పుడు డెక్కన్ చార్జెస్ లో ఎవరూ పెద్దగా రాణించలేక పోయినా చివరికి రోహిత్ శర్మ నిలకడైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు అని గుర్తు చేశాడు. ఆ సమయంలో వివిఎస్ లక్ష్మణ్ కూడా డెక్కన్ చార్జర్స్ లో ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ప్రతి విజయంలోనూ ఉంది అని తెలియజేశాడు. అప్పటి నుంచే రోహిత్ శర్మ తన ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ వెళుతూ ప్రస్తుతం రాటు తేలాడు అని తెలిపాడు. అంతేకాదు జట్టుకు అవసరమైనప్పుడు తన వాయిస్ కూడా వినిపించేవాడు అని తెలియజేశాడు. ఇకపోతే రోహిత్ బ్యాటింగ్ ప్రధానంగా ఐపీఎల్లో ఒక సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్నాడంటే అందుకు కారణం ఒత్తిడి జయించి నాలుగుసార్లు కెప్టెన్ గా ఐపీఎల్ కప్పు గెలవడమే అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: