భారత క్రికెట్ చరిత్రలో మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఒక అరుదైన ఆటగాడు అన్న విషయం తెలిసిందే. వికెట్ కీపింగ్ లో బాటిల్ లో కెప్టెన్సీలో ధోని కి ఎవరూ సాటి రారు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ధోనీ తన కెరీర్ లో ఎన్నో అద్భుతాలను కూడా సృష్టించాడు. అయితే ధోని లేకుండా అసలు క్రికెట్ జట్టును ఊహించుకోలేరు  క్రికెట్ ప్రేక్షకులు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్న నేపథ్యంలో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు రాబోతున్నారు అని టీమిండియా ప్రేక్షకులు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో టీమిండియా జట్టులో కి రిషబ్ పంత్ ఎంట్రీ ఇచ్చాడు... ధోని లాగానే రిషబ్ పంత్ కూడా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కావడం... వికెట్ కీపర్ కావడం తో .. రిషబ్ పంత్ ధోని అసలుసిసలైన వారసుడు అని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. 

 


 అటు బిసిసిఐ సెలెక్టర్లు కూడా ఇదే అనుకున్నారు. అందుకే రిషబ్ పంత్ ఎన్ని మ్యాచ్లలో విఫలమవుతూ వచ్చినప్పటికీ ఏ ఆటగాడికి ఇవ్వనని అవకాశాలు ఇచ్చారు. అయితే మొదట్లో కాస్త కూస్తో బెటర్ అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం రిషబ్ పంత్ అవకాశాలను వినియోగించుకోలేక పోయాడు. ఎన్ని అవకాశాలు వచ్చినా పేలవ  ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కున్నాడు రిషబ్ పంత్. అటు వికెట్ కీపింగ్ లో కూడా పేలవ ప్రదర్శన చేయడంతో... ధోని   వారసుడు అని అనుకుంటున్న ప్రేక్షకులకు రిషబ్ పంత్ నుంచి నిరాశే ఎదురైంది. అయితే తాజాగా ధోనీ వారసుడిగా మరో కొత్త పేరు తెరమీదికి వచ్చింది. ఈ విషయాన్ని కర్ణాటక క్రికెటర్ రాబిన్ ఉతప్ప తెలిపారు. 

 


 రియాన్  పరాగ్  టీమిండియాలో ధోని స్థానాన్ని భర్తీ చేయగల అసలుసిసలైన ఆటగాడు అంటూ చెప్పుకొచ్చాడు. ధోని తర్వాత పరాగే నని అతన్ని భారత జట్టులో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ పేర్కొన్నాడు.పరాగ్  సామర్థ్యాన్ని బట్టి టీమిండియాలో ఎక్కువ రోజులు సేవలు అందిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రియాన్  పరాగ్  పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు... క్రికెట్ ఆట పై మంచి పట్టు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదుగుతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే అసోం  రాష్ట్రానికి చెందిన పరాగ్  వయసు కేవలం 18 ఏళ్ళు . అసోమ్ రంజీ జట్టు తరఫున దేశవాళి పోటీల్లో ఆడుతూ...  ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ సీజన్ లో  ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు రియాన్  పరాగ్ .

మరింత సమాచారం తెలుసుకోండి: