ప్రస్తుత సమకాలీన ప్రపంచ క్రికెట్లో స్టార్ బాట్స్మెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ కేవలం ఆట లోనే కాకుండా తన ఆదాయంలోనూ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న వందమంది స్పోర్ట్స్ పర్సన్ తో తాజాగా ఫోర్బ్స్ ఓ జాబితా విడుదల చేసింది. ఇకపోతే ఆ తాజా లిస్టులో భారతదేశం నుంచి కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడు మాత్రమే చోటు సంపాదించాడు. 2019 ఫోర్బ్స్ జాబితాలో విరాట్ కోహ్లీ 100వ స్థానాన్ని సంపాదించాడు. అయితే ఈ ఏడాది నెంబర్ వన్ స్థానాన్ని దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ రూ. 801 కోట్ల ఆదాయంతో మొదటి స్థానాన్ని అందుకున్నాడు. ఒక టెన్నిస్ ప్లేయర్ ఇలా మొదటి స్థానాన్ని సంపాదించడం ఇదే మొదటిసారి. 

 

IHG


ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు రూపంలో అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 సంవత్సరం వరకు ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ఏడు కోట్లు అందుకున్నాడు. ఇక ఇది మాత్రమే కాకుండా మ్యాచుల్లో ప్రైజ్ మనీ, మ్యాన్ అఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇలా అనేక రకాలుగా మరో 7 కోట్ల వరకు కోహ్లీ ఆర్జించాడు. ఇక తన అనేక సంస్థల కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్న విరాట్ కోహ్లీ సుమారుగా 170 కోట్ల నుంచి 180 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇకపోతే ఫోర్బ్స్ తన జాబితాను విరాట్ కోహ్లీ ఆదాయం జూన్ 1, 2019 సంవత్సరం నుంచి జూన్ 1, 2020 వరకు మధ్య కాలాన్ని పరిగణలోకి తీసుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణం చేత అనేక మ్యాచ్ లో ఆడకుండా కోహ్లీ ఉండిపోవాల్సి వచ్చింది. ఒకవేళ మ్యాచులు జరిగి ఉంటే కోహ్లీ మరింతగా సంపాదించేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: