సాధారణంగా అంగవైకల్యంతో ఉంటే వారిని కొంత మంది అయ్యో పాపం అనే వారు ఉన్నారు.. కొంత మంది ఛీదరించుకనే వారు ఉన్నారు.  అయితే అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు అని ఎంతో మంది గొప్పగొప్ప పనులు చేసిన వారు ఉన్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారు ఉన్నారు.  అలాంటి వారికి సంకల్పం ఉంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్ది వొదగమని అర్థం అందులో ఉంది.. అన్ని అవయవాలు సరిగా ఉండి గర్వంతో మానిసక వైకల్యం ఉన్నవారు దేశంలో ఎంతో మంది ఉన్నారు.  రెండు చేతులు లేకున్నా క్రికెట్ ఆడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

 

ఎవరూ నమ్మలేని విధంగా బౌలింగ్ చేస్తూ.. బ్యాంటింగ్‌తో బౌండరీలు బాదుతున్నాడు.  శరీరానికే కాని వైకల్యం నా మనసుకు కాదు అని అంటాడు ఆ యువకుడు.  కశ్మీర్‌కు చెందిన ఈ యువకుడి  ప్రతిభకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. నిజానికి ఇది పాత వీడియోనే అయినా కూడా అతని సంకల్పానికి మెచ్చి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ షేర్ చేశాడు. దీంతో అతని ఆట తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.   అమీర్ వాసిం అనే యువకుడు పుట్టుక నుంచే దివ్యాంగుడు. అయినా కూడా ఏ మాత్రం పట్టు సడలలేదు. తన కంటూ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు.

 

రెండు చేతులు లేకపోయినా మెడకు బ్యాట్ తగిలించుకుని బ్యాటింగ్ చేస్తూ.. అద్భుతాన్ని సృష్టిస్తున్నాడు. ఇది చూసి ఎంతో స్ఫూర్తి పొందిన వీవీఎస్ లక్ష్మన్ జీవితంలో ఎదగాలన్న నిప్పులాంటి ఆకాంక్ష మీ హృదయంలో బలంగా ఉంటే, మీ దారికి అడ్డం వచ్చే ఎలాంటి అవాంతరాల్నైనా అది దహించివేస్తుంది’ అని అభిప్రాయపడ్డాడు. కాగా అమీర్ గతేడాది దివ్యాంగుల వరల్డ్ క్రికెట్ సిరీస్ టోర్నమెంట్‌కు ఎంపికై తన సత్తా చాటుకున్నాడు.  ప్రస్తుతం కరోనా వైరస్ తో అందరై భయంతో కృంగిపోతున్నారు.. ఇప్పుడు భయం కాదు.. దాన్ని ఎదిరించి పోరాడే సంకల్పం ఉండాలన్నది ఆయన ఉద్దేశం. 

మరింత సమాచారం తెలుసుకోండి: