ప్రస్తుతం లాక్‌డౌన్‌ సమయం కావడంతో ప్రస్తుతం క్రికెట్ ఆటగాళ్ళు అందరు ఇంటికే పరిమితం  అయిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో అటు మాజీ క్రికెటర్లతో  పాటు ప్రస్తుత క్రికెటర్లు కూడా తన కెరియర్ లో జరిగిన కొన్ని అనుభవాలను అభిమానులకు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ తన కెరీర్లు కీలక ఆటగాళ్ల  గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పై ప్రశంసలు కురిపించారు వివిఎస్ లక్ష్మణ్. సచిన్ టెండుల్కర్ అనిల్ కుంబ్లే లాంటి గొప్ప ఆటగాళ్లతో తాను కూడా కలిసి ఆడటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు వి.వి.ఎస్.లక్ష్మణ్. 

 


 మామూలుగానే వివిఎస్ లక్ష్మణ్ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. పలు విషయాలపై స్పందిస్తూ తనదైన స్టైల్లో కామెంట్ చేస్తూ ఉంటాడు. అయితే తన క్రికెట్ కెరీర్లో తనను బాగా ప్రభావితం చేసిన సహచరుల గురించి అభిప్రాయాలు పంచుకుంటానని ఇప్పటికే అభిమానులకు తెలుపగా...  తాజాగా తన క్రికెట్ కెరీర్ లోనే గొప్ప  సహచరులు ఎవరు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన క్రికెట్ కెరీర్లో సచిన్ టెండూల్కర్ అనిల్ కుంబ్లే గొప్ప సహచరులు  అంటూ తెలిపిన వివిఎస్ లక్ష్మణ్ వారి గొప్పతనాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేసే పనిని వదలక పోవడం అనే  లక్షణం కుంబ్లే లో ఉంది అంటూ...మ్యాచ్ లో  జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. 


 2002 సంవత్సరంలో వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అనిల్ కుంబ్లే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దవడకు గాయమైందని.. కానీ అనిల్ కుంబ్లే దాని అసలు లెక్కచేయలేదని కట్టు కట్టుకుని వచ్చి మైదానంలో ఆట  కొనసాగించారు అంటూ చెప్పుకొచ్చాడు వివిఎస్ లక్ష్మణ్. ఆ తర్వాత ఫీల్డ్ లోకి  కూడా రావడం గాయం నొప్పి గా ఉన్నప్పటికీ బౌలింగ్ కూడా చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశాడు. అనిల్ కుంబ్లే కు ఉన్న తెగువ ఈ ఫోటోలో కనిపిస్తున్నది అంట ప్రశంసలు కురిపించాడు. అంతకుముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్పై ప్రశంసల వర్షం కురిపించారు. సచిన్ టెండుల్కర్ ఎన్ని ప్రశంసలు అందుకున్నప్పటికీ ఎంతో ఒదిగి ఉండటమే ఆయనలో గొప్ప లక్షణం అంటూ కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: