కరోనా వైరస్ పుణ్యమా ప్రపంచంలో చాలా రంగాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో మాదిరిగా ప్రతి రంగంలో ఇది వరకు ఉన్నట్టు కాకుండా సరికొత్త మార్పులు తప్పదు అని కరోనా వైరస్ నిపుణులు తమ అభిప్రాయాలను కుండ బద్దలు కొడుతున్న విషయం విదితమే. కాగా క్రికెట్ ఆటలో కూడా చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగా స్టేడియంలో ప్రేక్షకులు కిక్కిరిసి పోయేలా కూర్చునే అవకాశం ఉండదని మైదానంలో ఆటగాళ్లు ఆడే ఆటకి గ్యాలరీ లో ఉండే వాళ్ళు ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకునే అవకాశాలు ఉండవని, సంబరాలు చూడలేమని చాలామంది అంటున్నారు.

IHG

ఇదే సమయంలో మైదానంలో ఆడే ఆటగాళ్లు కూడా గ్రౌండ్ లో ఉమ్మి వేయకూడదు...అలాగే బంతిపై ఉమ్ము రాయకూడదు ఇలాంటి నిబంధనలు గ్యారెంటీగా ఉంటాయని సో ఇది ఒక క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇదే టైమ్ లో లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచ్లు త్వరలో నిర్వహించడానికి బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు జరిగిన, టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఐసిసి రద్దు చేసే అవకాశం ఉన్నట్లు స్పోర్ట్స్ విశ్లేషకులు అంటున్నారు.

IHG

అంతర్జాతీయ మ్యాచ్ లు జరగాలంటే ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే ఐపీఎల్ మ్యాచ్ లు జరగటం క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ అయితే  గ్రౌండ్ లో ఆడియన్స్ లేకుండా మ్యాచ్ లు ఉండటం అనేది బ్యాడ్ న్యూస్.  

మరింత సమాచారం తెలుసుకోండి: