ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా క్రికెట్ ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమైన నేపథ్యంలో... తమ క్రికెట్ అనుభవాల గురించి ఇతర ఆటగాళ్లు గురించి తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టార్ ఆటగాడైనా టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను విరాట్ కోహ్లీని  ఎంతగానో ఇష్టపడతాను  అంటు  తెలిపిన స్టీవ్  స్మిత్.. అతను ఒక అద్భుతమైన ఆటగాడు అంటు  చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ  రికార్డులను పరిశీలించిన అందరికీ అర్థం అవుతుందని తెలిపారు. క్రికెట్ కోసం విరాట్ కోహ్లీ ఎంతో చేశాడని...విరాట్ క్రికెట్ లోనే ఒక అద్భుతం అంటు ప్రశంసించాడు.  కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే దేశ క్రికెట్ అభిరుచి స్పష్టంగా వ్యక్తమవుతుంది అంటూ స్మిత్ వ్యాఖ్యానించాడు. 

 

 విరాట్ కోహ్లీ తన ఆటను మార్చుకోవడానికి ఎప్పటికప్పుడు సిద్ధమవుతూ ఉంటాడు అంటూ తెలిపిన స్మిత్ ... విరాట్  కోహ్లీ  ఇప్పుడు ఎంతో శక్తివంతంగా దారుఢ్యంగా  ఉన్నాడు అంటూ వ్యాఖ్యానించిన  స్టీవ్ స్మిత్... నిజంగా అతను క్రికెట్ కి ఒక అద్భుతం అంటూ వ్యాఖ్యానించాడు. అయితే విరాట్ కోహ్లీ గురించి చెడుగా  ఒక్క మాట కూడా అనలేను  అంటూ చెప్పు స్టీవ్  స్మిత్ తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచేది ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనే విషయం తెలిసిందే. వీరి ఆట తీరు వేరే అయినప్పటికీ వీరు మాత్రం ప్రపంచంలోనే క్రికెటర్లు  అందరిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

 

 

 అలాంటి గొప్ప ఆటగాడైనా స్టీవ్ స్మిత్ మరో గొప్ప ఆటగాడు  విరాట్ కోహ్లీ  ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా తాను ఎంతగానో ఇష్టపడేది తెలుపు రంగు బంతితో  విరాట్ కోహ్లీ లక్ష్యఛేనె  అంటూ చెప్పుకొచ్చాడు స్మిత్.  ఒత్తిడిలో ఎంతో చక్కగా వ్యూహాత్మకంగా ఆడటంలో విరాట్ కోహ్లీ తనకి తానే సాటి అంటూ చెప్పుకొచ్చాడు. ఎలాంటి ఆటగాడు అయినా సరే విరాట్ కోహ్లీ ఆటను చూసి ప్రేరణ పొందాల్సిందే అంటూ విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించాడు స్మిత్ .

మరింత సమాచారం తెలుసుకోండి: