తన మరణంతో అమెరికా దేశ‌నంతంటిని కదిలించాడు ఆఫ్రో-అమెరికన్ అయిన జార్జి ఫ్లాయిడ్. ఇప్పుడు జార్జి ఫ్లాయిడ్ జీవితం గురించి ఆయ‌న ఎదుర్కొన్న ఎత్తుప‌ల్లాల గురించి ఒక్కోటి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అతని జీవితంలో ఘనతలున్నాయ‌ని తెలుస్తోంది. జార్జ్ ఫ్లాయిడ్ గొప్ప ఫుట్ బాల్ క్రీడాకారుడంటా. స‌రైన ప్రొత్సాహం ల‌భించ‌క అంత‌ర్జాతీయ స్థాయికి చేరుకోలేక‌పోయిన‌ట్లు కుటుంబ స‌భ్యుల ద్వారా తెలుస్తోంది.  1992లో హ్యూస్టన్‌లో ఉంటున్నప్పుడు యేట్స్ స్కూల్‌ లయన్స్ జట్లు తరఫున టెక్సాస్‌ స్టేట్ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌లో ఫ్లాయిడ్‌ పాల్గొన‌డం విశేషం. అంతేకాదు..ఈ టోర్నీలో రన్నర్స్ అప్‌గా నిలిచిన జ‌ట్టులో  అతను సభ్యుడు.

 

 జాన్‌ యేట్స్‌ హైస్కూలు ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడిన ఫ్లాయిడ్‌ 88వ నంబర్‌ జెర్సీ ధరించేవారు. ఆ తర్వాత సౌత్‌ ఫ్లోరిడా స్టేట్‌ కాలేజ్‌ బాస్కెట్‌బాల్‌ జట్టుకు ఎంపికయ్యాడు. 1993 నుంచి 1995 వరకు అక్కడే జార్జ్‌ అక్కడే విద్యాభ్యాసం కొన‌సాగింది. కొన్నాళ్ల తర్వాత టెక్సాస్‌ తిరిగి వచ్చి కింగ్స్‌విల్లేలోని ఏ అండ్‌ ఎమ్ యూనివర్సిటీలో చేరారు. అయితే ఫ్లాయిడ్ డిగ్రీ పూర్తి చేయలేదు. క్ర‌మంగా ఆయ‌న త‌ప్పుదోవ ప‌ట్టార‌ని ఆ త‌ర్వాత‌కు మాకు తెలిసింద‌ని ఆయ‌న స్నేహితులు మీడియాకు వెల్ల‌డించారు.
ఆరడుగుల, ఆరంగుళాల పొడవున్న ఫ్లాయిడ్‌కు అథ్లెటిక్స్‌ కోసం పుట్టినట్లు కనిపిస్తారు. టీనేజ్‌లో ప్లాయిడ్‌ను స్నేహితులు 'జెంటిల్‌ జెయింట్‌' అని పిలిచేవారు. బాస్కెట్‌బాల్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆడటంలో ఆయన దిట్ట. 12 సంవత్సరాల వయసులోనే ఫ్లాయిడ్‌ 6 అడుగుల 2 అంగుళాల పొడవు ఉండేవాడ‌ని అతని చిన్ననాటి స్నేహితులు, అతని టీమ్‌మేట్‌ జోనాథన్‌ వీల్ మీడియాకు తెలిపారు. 


ఇదిలా ఉండ‌గా ఫ్లాయిడ్ జీవితంలో ఎత్తుప‌ల్లాలు కూడా ఉన్నాయి. 2007 సంవత్స్రరంలో ఒక దొంగతనం కేసులో ఫ్లాయిడ్‌ ఐదు సంవత్సరాల జైలు శిక్షను కూడా అనుభవించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. డ్రగ్స్‌ సరఫరా, దొంగతనం కేసుల్లో అనేకసార్లు అరెస్టయ్యారు ఫ్లాయిడ్‌. మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నేరంపై 2007లో కోర్టు ఫ్లాయిడ్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.  జైలు నుంచి విడుదలయ్యాక, మంచి మనిషిగా మారే క్రమంలో జార్జ్‌, స్థానికంగా పనిచేసే మత సంస్థ రిసరెక్షన్‌ హ్యూస్టన్‌లో చేరారు అని అతని చిన్ననాటి మిత్రుడు లిల్లార్డ్‌ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: