కరోనా వల్ల గత కొంత కాలం నుండి స్థంబించిపోయిన క్రికెట్ క్రీడా తిరిగి ప్రారంభం కానుంది అందులో భాగంగా మొదటి అంతర్జాతీయ టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ లు తలపడనున్నాయి. ఇందుకోసం విండీస్ జట్టు ,ఇంగ్లాండ్ లో పర్యటించాల్సి వుంది. ఈపర్యటనలో ఆతిథ్య జట్టుతో , విండీస్ మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తలపడనుంది.
 
ఇక ఈపర్యటనకు ముగ్గురు విండీస్ స్టార్ ఆటగాళ్లు దూరంగా వున్నారు. ఓపెనర్ డారెన్ బ్రావో, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ షిమ్రోన్ హేట్మేయర్ ,ఆల్ రౌండర్ కీమో పాల్ ఈసిరీస్ నుండి తప్పుకున్నారు. కరోనా భయం వల్లే  వీరు ఈనిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే బోర్డు మాత్రం వీరి నిర్ణయాన్ని స్వాగతించింది. ఈముగ్గురు ఆటగాళ్ల స్థానంలో చేమర్ హోల్డర్ ,రేమాన్ రీఫైర్ ,బొన్నెర్ ను ఎంపికచేశారు. ఈముగ్గురికి ఇదే మొదటి టెస్టు సిరీస్. వీరితోపాటు బ్లాక్ వుడ్ కూడా స్థానం దక్కించుకున్నాడు. 
 
మొత్తం ఈపర్యటనకు14మంది ఆటగాళ్లను ఎంపికచేసింది విండీస్ క్రికెట్ బోర్డు. ఈనెల9న కరేబియన్ జట్టు, ఇంగ్లాండ్ బయలుదేరనుంది. అనంతరం 14రోజులు క్వారంటైన్ లో ఉండనున్నారు. వచ్చే నెల 8నుండి  సౌతాంఫ్టన్ లో ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈమూడు టెస్టు లు కూడా ప్రేక్షకులు లేకుండా  ఖాళీ మైదానాల్లో జరుగనున్నాయి. 
 
విండీస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), బ్లాక్ వుడ్ , రోస్టన్ చేస్ ,బ్రూక్స్ ,క్యాంప్ బెల్,కార్న్ వాల్ , షేన్ డౌరిచ్ ,హోప్ ,అల్జారీ జోసెఫ్ , కీమర్ రోచ్, క్రైగ్ బ్రాత్ వైట్,  చేమర్ హోల్డర్ , రేమాన్ రీఫైర్ , బొన్నెర్

మరింత సమాచారం తెలుసుకోండి: