సుదీర్ఘ విరామం తరువాత ఎట్టకేలకు క్రికెట్ తిరిగి ప్రారంభం కానుంది. జులై లోఇంగ్లాండ్ -వెస్టిండీస్ ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ తో ఈ జెంటిల్మెన్ గేమ్ పున:ప్రారంభం కానుంది. ఈసిరీస్ కోసం విండీస్ ,ఇంగ్లాండ్ కు రానుంది. ఈపర్యటనలో ఆతిథ్య జట్టుతో  విండీస్ మూడు మ్యాచ్ లటెస్టు సిరీస్ లో తలపడనుంది అందులో భాగంగా మొదటి టెస్టు, జులై 8-12 వరకు సౌతాంఫ్టన్ లోని ఏజెస్ బౌల్ వేదికగా జరుగనుండగా రెండో టెస్టు, జులై 16-20 వరకు, మూడో టెస్టు, జులై 24-28  వరకు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికలో  జరుగనున్నాయి. ఈమూడు టెస్టులు కూడా ప్రేక్షకులు లేకుండానే ఖాళీ మైదానాల్లో జరుగనున్నాయి అయితే యూకే ప్రభుత్వం నుండి ఈసిరీస్ కు ఇంకా గ్రీన్ సిగ్నల్ రావల్సివుంది. 
 
ఇక మొదటి టెస్టు కు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అందుబాటులో ఉండడం అనుమానంగానే మారింది. జులై మొదటి వారంలో రూట్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుంది దాంతో రూట్ మొదటి టెస్టు కు దూరమయ్యే ఛాన్స్ వుంది. ఒకవేళ నేను దూరమైతే  వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని రూట్ పేర్కొన్నాడు. అదే నిజమైతే స్టోక్స్ మొదటిసారి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ కు సారథ్యం వహించనున్నాడు. గత కొంత కాలం నుండి అద్భుతమైన ప్రదర్శన తో జట్టుకు ఒంటి చేత్తో  తిరుగులేని విజయాలు అందిస్తున్న స్టోక్స్ ఈరోజు తన 29వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈసందర్బంగా సహచరులు ,ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్టోక్స్ కు విషెస్ తెలియజేస్తున్నారు.
 
ఇక ఇంగ్లాండ్ సిరీస్ కు వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు డారెన్ బ్రావో ,హేట్మేయర్, కీమో పాల్ దూరంగా వున్నారు. ఈ పర్యటన కోసం జూన్ 9న వెస్టిండీస్ ,ఇంగ్లాండ్ కు చేరుకోనుంది అనంతరం విండీస్ జట్టు సభ్యులంతా 14రోజులు క్వారంటైన్ లో ఉండనున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: