టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తన ఇంటి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు ఆయన తెలిపాడు. కాకపోతే అందుకు సంబంధించిన గల కారణాలు కూడా చెప్పుకొచ్చాడు రాబిన్ ఊతప్ప. ఆయన సరిగా క్రికెట్ మ్యాచ్ ఆడనప్పుడు దాంతో తనకు చావు మాత్రమే శరణ్యం అని డిప్రెషన్ కు వెళ్లాను అని ఆయన తెలిపాడు. నిజానికి ఎవరికైనా రేపు భవిష్యత్తు ఏంటి అని ఆలోచనతోనే బతికేస్తుంటారు. అలాంటిది రేపు భవిష్యత్ ఏంటి అనే ఆలోచనలతో తీవ్రంగా డిప్రెషన్ కి లోను అయ్యేవాడిని దాంతో తన ఇంట్లోని బాల్కనీ నుంచి ఒక సందర్భంలో దూకుదాం అనుకున్నాను అని ఆయన తెలిపాడు. 

 

నిజానికి తాను 2006 సంవత్సరంలో టీమిండియా జట్టుకు తన మొదటి మ్యాచ్ ఆడగా అప్పుడు నా గురించి నాకు పెద్దగా తెలియదు అని తెలియజేశాడు. నిజానికి నేను అప్పటి నుంచే చాలా ఎక్కువ నేర్చుకున్నానని కూడా తెలియజేశాడు. ప్రస్తుతం నేను ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు నేను కిందికి పడిపోతుంటే ఎలా పైకి మళ్ళీ ఎదగాలి అనే సమాసం మీద బాగా అవగాహన వచ్చిందని ఆయన తెలిపాడు. నిజానికి నేను ఈ పరిస్థితికి చేరుకోవడానికి ఎన్నో అవరోధాలను దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ తెలియజేశాడు.


తాను టీమిండియాకు సెలెక్ట్ కాకపోయినా సమయాలలో తీవ్ర నిరాశకు గురై పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లి పోయాను అని తెలిపాడు. ఇక ఆ సమయంలోనే తాను సూసైడ్ చేసుకోవాలని భావించానని తెలియజేశాడు. ముఖ్యంగా 2010 - 11 సమయంలో నరకం అనుభవించానని ఆయన తెలియజేశాడు. ఇక ఆ తర్వాత తన కుటుంబ సహాయంతో క్రమేపీ మెరుగుపడుతూ వచ్చానని ఆయన తెలిపాడు. ప్రస్తుతం కేవలం క్రికెట్ రంగం పైనే కాకుండా ఇతర విషయాలపై కూడా దృష్టి పెడుతున్నాను అని తెలియజేశాడు. నేను చేసేది తప్పా, ఒప్పా... అని చూసుకుంటూ రొటీన్ లైఫ్ లో ముందుకు వెళ్తున్నాం అని ఊతప్ప తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: