టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ మరోసారి బ్యాట్ పట్టాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేస్తున్న సంగతి అందరికీ విదితమే. ఇకపోతే తాజాగా మహమ్మద్ అజారుద్దీన్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం లో కొద్దిసేపు సరదాగా క్రికెట్ ఆడాడు. ఇలా ఆడిన ఆటని వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆయన పంచుకున్నారు. ఆ వీడియోలో ఆడిన ఫ్లిక్ షాట్ కు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు.

 

 

 

కేవలం 21 ఏళ్ల వయసులోనే ఆయన భారత జట్టు లో చేరి అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాకు కెప్టెన్ గా కొన్ని సంవత్సరాలు పని చేశారు. ఇకపోతే ఆయన ఆడిన మొదటి మూడు టెస్ట్ మ్యాచులో కూడా ఆయన సెంచరీలు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పి అదరహో అనిపించారు. ఇకపోతే ఆయన తన క్రికెట్ ప్రస్థానంలో మొత్తంగా 99 టెస్టులు 334 అంతర్జాతీయ వన్డేలు ఆడారు.. అయితే దక్షిణాఫ్రికా సిరీస్ లో కొన్ని మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లుగా తేలడంతో అందులో అజారుద్దీన్ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన నుంచి క్రికెట్ దూరానికి కారణమైంది.

IHG

 

దీనితో బిసిసిఐ ఆయన పై జీవిత కాల నిషేధం విధించింది. 2012 సంవత్సరంలో ఆ నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠం ఎక్కారు.

మరింత సమాచారం తెలుసుకోండి: