టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజు సరదాగా చేసిన వ్యాఖ్యలు పోలీస్ కేసు దాక వెళ్ళాయి. ఇటీవల ఓ ఆన్ లైన్ కార్యక్రమంలో అభిమానులతో నెటిజన్ల తో చిట్ చాట్ చేసిన సమయంలో తన మాజీ సహచరడు స్నేహితుడు అయిన స్పిన్నర్ చాహల్‌ను ఉద్దేశించి ఓ ఆన్ లైన్ చాట్ కార్యక్రమంలో ఉపయోగించిన ‘భాంగి’ అనే పదం వివాదానికి దారి తీసింది. అటువంటి పదం దళితులను కించపరచడానికి ఉపయోగిస్తారని… ఇలాంటి సందర్భంలో యువరాజ్ సింగ్ పొరపాటున ఆ పదం వాడటంతో తమ కులాన్ని కించపరచడం జరిగిందని హర్యానాకు చెందిన దళిత హక్కుల నేత న్యాయవాది రజత్ కలశన్ యువరాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

IHG' trends on <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TWITTER' target='_blank' title='twitter-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>twitter</a> for making casteist ...

ఇటీవల యువరాజ్ సింగ్ మరియు ఇండియన్ క్రికెట్ టీమ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తో సోషల్ మీడియాలో లైవ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత స్పిన్నర్లు గురించి యువరాజ్ సింగ్ చాహల్, కుల్‌దీప్‌ల గురించి మాట్లాడాడు. అందులో భాగంగా చాహల్‌ గురించి స్పందిస్తూ ‘భాంగి’ అనే పదాన్ని వాడాడు. వెంటనే రోహిత్ శర్మ నవ్వడం జరిగింది.

IHG' trends after he allegedly makes ...

ఆ తర్వాత నెటిజన్లు యువరాజ్ సింగ్ దళితులకు వ్యతిరేకంగా మాట్లాడారని సోషల్ మీడియాలో బాగా కామెంట్లు చేయటంతో ఈ వివాదం రాజుకుంది. ఈ పరిణామంతో యువరాజ్ సింగ్ ని దళిత నాయకులు గట్టిగా టార్గెట్ చేసి పోలీసు కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి యువరాజ్ సింగ్ మరియు రోహిత్ శర్మ మాట్లాడిన వీడియో సిడి ల వివరాలు పోలీసులకు అందజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: