ఇంగ్లాండ్ టూర్ కు ముందు ట్రైనింగ్ క్యాంప్ లో పాల్గొనాలనుకున్న పాక్ ఆటగాళ్లకు ఆదేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో ట్రైనింగ్ క్యాంప్ ను రద్దు చేస్తున్నట్లు  పీసీబీ ప్రకటించింది.  ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో లాహోర్ లో 25మంది ఆటగాళ్లు సాధన చేయాల్సివుంది కానీ రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువవుతుండడం తో ఇలాంటి సమయం లో ఒకే దగ్గర అందరు కలిసి ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని  పాక్ క్రికెట్ బోర్డు ఈనిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ లో కరోనా కేసుల సంఖ్య 100000 దాటగా 2000 మరణాలు సంభవించాయి.
 
ఇక ఇంగ్లాండ్ టూర్ కు ముందు పీసీబీ  కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ టీం కు వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ ను బ్యాటింగ్ కోచ్ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల మొదటి వారంలో పాక్ జట్టు ఇంగ్లాండ్ వెళ్లాల్సివుంది. ఆగస్టు లో ఆతిథ్య జట్టుతో పాక్ మూడు టెస్టులు ,మూడు టీ 20ల్లో తలపడనుంది అయితే ఈ సిరీస్ లకు సంబందించిన షెడ్యూల్ ఇంకా  ఫిక్స్ కాలేదు. ఇదిలావుంటే యూకే రూల్స్ ప్రకారం బయటి దేశం నుండి వచ్చినవారు 14రోజులు క్వారెంటైన్ లో ఉండడం తప్పినిసరి.
 
మరోవైపు మూడు టెస్టుల సిరీస్ కోసం  వెస్టిండీస్ జట్టు సోమవారం ,ఇంగ్లాండ్ కు చేరుకుంది. ఈ సిరీస్ తోనే  అంతర్జాతీయ క్రికెట్ పున:ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య జులై 8న సౌతాంఫ్టన్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభంకానుంది. ఈటెస్టు సిరీస్ బయో సెక్యూర్  వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా జరుగనుంది. ఈసిరీస్ కోసం విండీస్ 25మంది ఆటగాళ్లను ప్రకటించింది. ఇందులో 11 మందిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది క్రికెట్ వెస్టిండీస్.  

మరింత సమాచారం తెలుసుకోండి: