గత మూడు నెలలుగా కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అన్ని క్రీడలకు సంబంధించిన పెద్ద పెద్ద టోర్నీలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త ఆటలు మొదలయ్యే విధంగా కొనసాగుతున్నాయి. ఇకపోతే క్రికెట్ లో కూడా మ్యాచులు  ఆడేందుకు అనేక దేశాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇకపోతే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు అన్న సంగతి అందరికీ విదితమే. ఇది ఇది ఎంతలా ప్రభావితం చేస్తుంది అంటే తనతో పాటు తన టీం మేట్స్ ను కూడా ఫాలో అయ్యేలా చేస్తోంది. అయితే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యొక్క పరుగుల దాహం గెలుపు ఆకాంక్ష ఎప్పటికీ తనువు తీరదని మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. జట్టులోని యువ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ ఒక రోల్ మోడల్ అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ప్రత్యర్థి జట్టుపై ఎలాంటి జాలి పడకుండా మ్యాచ్ ను టీమ్ ఇండియా వైపు తీసుకు వస్తారని తెలిపాడు. 

 

 

విరాట్ కోహ్లీ గురించి మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ...  విరాట్ కోహ్లీ నుంచి ఏదైనా ప్రశంశ అందుకుంటే ఆ ఫీలింగ్ లో ఎవరికి మాటలు రావు అలాంటి మాటలు వర్ణించలేము అంటూ తెలిపాడు. అతను నిజమైన నాయకుడు... అంతేకాకుండా యువ క్రికెటర్లకు ఓ రోల్ మోడల్... ఇంకా చెప్పాలంటే కోహ్లీ ఒక సింహం లాంటోడు.. అని తెలుపుతూ అతని ఆకలి ఎప్పటికీ తీరదు, ఆటలోకి వెళ్ళిన ప్రతి సారి తన మొదటి మ్యాచ్ ఆడుతున్నట్లు అవతలి టీంపై కసిగా పై విరుచుకు పడతాడు అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి అతను తెలిపాడు. అయితే గత సంవత్సర కాలంగా టీమిండియాలో నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: