పాకిస్థాన్ క్రికెటర్లను కరోనా విడిచిపెట్టడం లేదు. ఇటీవల ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ అలాగే మాజీ ఆటగాడు తౌఫిక్ ఉమర్ లు కరోనా బారిన పడగా ప్రస్తుతం ఇద్దరూ పూర్తిగా కోలుకున్నారు. తాజాగా పాక్ మాజీ స్టార్ ఆల్ రౌండర్  షాహిద్ ఆఫ్రిదికి కూడా కరోనా  సోకింది. ఈవిషయాన్ని స్వయంగా ఆయనే  ప్రకటించాడు. గత రెండు రోజుల నుండి ఒంట్లో బాగుండడం లేదు,టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.. నేను త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్ధించండి అని ఆఫ్రిది ట్వీట్ చేశాడు. ఇక కరోనా వల్ల పాకిస్థాన్ లో ఆర్థికంగా అవస్థలు పడుతున్న పేద ప్రజలకు నిత్యావసర సరుకులను అందిస్తూ గత కొంత కాలంగా ఆఫ్రిది అండగా నిలబడుతూ వస్తున్నాడు అయితే ఇప్పుడే తనే కరోనా బారిన పడాల్సివచ్చింది. 
ఇదిలావుంటే పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈనెల 23న ఇంగ్లాండ్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈపర్యటనలో ఆతిథ్య జట్టు తో పాక్ ,మూడు టెస్టులు ,మూడు టీ 20ల్లో తలపడనుంది. ఆగస్టు లో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈపర్యటన కోసం నిన్న 29మంది ఆటగాళ్ల తో కూడిన జట్టును ప్రకటించింది పీసీబీ. స్టార్ బౌలర్ అమీర్ , మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ హారిస్ సోహైల్ ఈ పర్యటననుండి తప్పుకోగా అండర్ 19ప్రపంచ కప్ లో అదరగొట్టిన యువ క్రికెటర్ హైదర్ అలీకి చోటు దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: