భారత్, పాకిస్తాన్ దాయాది దేశాలు క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు జరిగిన ప్రపంచ మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు. ప్రస్తుతం ఇండియా - పాక్ మ్యాచ్ లు ఏమి జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ టోర్నీలో మాత్రమే రెండు దేశాలు తలపడుతున్నాయి. బయట వారు శత్రుదేశాల చూసిన తాము ఎప్పుడూ మిత్రుల వలె కలిసి ఉంటామని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు.ఇదేవిధంగా పాకిస్తాన్ ఆటగాళ్లు ఎప్పటికప్పుడు భారత్ క్రికెటర్లను పొగడ్తలతో ముంచెత్తారు.

 

టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మ తన రోల్​ మోడల్​ అని పాకిస్థాన్ యువ క్రికెటర్​ హైదర్​ అలీ స్పష్టం చేశాడు. జట్టుకు ఓపెనర్​గా రోహిత్​ చేసే ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో రాజకీయ పరంగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నప్పటికీ.. ఇటువంటి ప్రశంసలు రావడం గమనార్హం.

 

రాబోయే ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనున్న 29 మంది సభ్యుల పాకిస్థాన్​ జట్టులో హైదర్​ కూడా ఉన్నాడు. ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్​, పాకిస్థాన్ మధ్య మ్యాచ్​లు నిలిచిపోయాయి. అయితే దాయాది జట్టు అప్పుడప్పుడు బహుళ జట్టు టోర్నీల్లో భారత్​తో తలపడుతుంటుంది.

 

2007లో  పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు వెళ్లినప్పుడు ఇరుదేశాల ఆటగాళ్ళు కలిసి భోజనం చేయడం గమనించాను అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ గుర్తు చేసుకున్నారు. భారత్ పై పాక్ గెలవాలని తమ ప్రేక్షకులు కోరుకుంటారు, పాక్ పై భారత్ గెలవాలని వారి ప్రేక్షకులు కోరుకుంటారని అని అన్నారు. తమ మధ్య ఆట తప్ప ద్వేషాలు ఏమీ లేవని మరోసారి గుర్తు చేశారు.
2017 ఛాంపియన్ ట్రోఫీ లో భారత్ పై పాక్ గెలవడం తాను ఎప్పటికీ మర్చిపోలేని అప్పుడు తమ ప్రేక్షకులు ఎంతో ఆనందించాలని చెప్పుకొచ్చారు.

 


ఇంగ్లాండ్లో ఓ సారి జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి  338 పరుగులు చేయగా, భారత్ పాకిస్తాన్ ను వెంబడించే ప్రయత్నంలో  159 పరుగులకే ఆలౌట్ అయింది అని , అయితే ఇప్పటి వరకు ప్రపంచ కప్ విషయంలో భారత్ ను పాకిస్తాన్ ఎప్పుడు ఓడించలేక పోయిందని అని అన్నారు. ఇప్పటివరకు పాకిస్తాన్ ఏడుసార్లు ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తో పోటీపడి ఏడుసార్లు బోల్తా కొట్టిందని సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: