ఆటగాళ్లకు పురస్కారాలు సరైన ప్రోత్సాహంగా నమ్ముతారు. వారికి ఎన్ని పురస్కారాలు వస్తే అంత ప్రతిభ వారి లో దాగి ఉందని వారికి వారు నమ్ముతారు ప్రేక్షకులు నమ్ముతారు. కష్టపడితేనే అందుతాయని క్రీడారంగంలో మన కంటికి కనిపించే నగ్నసత్యం. ఎందరో క్రీడాకారులు రాత్రి పగలు కష్టపడి మట్టిలో మాణిక్యాల మెరిసి ఎన్నో ప్రతిభా పురస్కారాలు, అవార్డులు రివార్డులు పొందారు.

 

పురస్కారాల జాబితాలో అటు యుద్ధరంగంలో సైనికులకు, ఇటు రణరంగాన్ని తొలగించే క్రీడామైదానంలో మీరు చేసే విన్యాసాలకి ఇచ్చే పురస్కారాలు శిఖరాలను దాటుతాయి. ఈ పురస్కారాలు  వారి ప్రతిభకు సరైన నిదర్శనంగా మారతాయి. ఇప్పుడు అవార్డులు ప్రతిభావంతులకు అందజేసే సమయం వచ్చింది.

 

భారత బ్యాడ్మింటన్​ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్​ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు సిఫార్సు చేసింది భారత బ్యాడ్మింటన్​ సంఘం. ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు భారత అగ్రశ్రేణి ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ పేరును భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) సిఫార్సు చేసింది. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన శ్రీకాంత్‌ క్షమాపణలు చెప్పగా.. బాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అర్జున అవార్డుకు తన పేరును సిఫార్సు చేయకపోవడం వల్ల బాయ్‌పై విమర్శలు గుప్పించిన ప్రణయ్‌కు షోకాజ్‌ నోటీసు జారీచేసింది.

 

 

ఫిబ్రవరిలో ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌ ఆడకుండా శ్రీకాంత్‌, ప్రణయ్‌లు వేరే టోర్నీ కోసం బార్సిలోనా వెళ్లారు. జట్టును వీడొద్దని చెప్పినా వినలేదు. దీంతో పతకం గెలిచే అవకాశం త్రుటిలో చేజారింది. బాయ్‌కు పంపిన ఈమెయిల్‌లో శ్రీకాంత్‌ తన తప్పు ఒప్పుకున్నాడు. భవిష్యత్తులో అలాంటి తప్పు చేయనని చెప్పాడు. ఎన్నో ఘనతలు సాధించిన శ్రీకాంత్‌ పేరును ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేశాం. ప్రణయ్‌కు షోకాజ్‌ నోటీస్‌ పంపించాం. అతను స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం" అని బాయ్‌ కార్యదర్శి అజయ్‌ సింఘానియా తెలిపాడు. ఇటీవలే అర్జున కోసం సమీర్‌ వర్మ పేరును బాయ్‌ ప్రతిపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: