టీం ఇండియా లో ఎంత మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఒకవైపు బ్యాటింగ్ తో ఎన్నో మెరుపులు మెరిపిస్తూ... మరోవైపు తన బౌలింగ్ తో ఎంతో  మ్యాజిక్ క్రియేట్ చేస్తూ.. ఇంకో వైపు తన ఫీల్డింగ్ తో ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు రవీంద్ర జడేజా. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా రవీంద్ర జడేజా ఎంతో  స్ఫూర్తిగా నిలుస్తాడు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ ఆట విషయంలో అతనికి కచ్చితత్వం డెడికేషన్ అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే తాజాగా జడేజా ఆట తీరు గురించి బిజెపి ఎంపీ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 

 


 ప్రస్తుతం ఉన్న ప్రపంచ క్రికెట్ లో  టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అత్యుత్తమం  అంటూ కితాబిచ్చాడు గౌతం గంభీర్. తాజాగా ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంబీర్ క్రికెట్ ఆట విషయంలో రవీంద్ర జడేజా కు ఉన్న డెడికేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లందరూ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు అంటూ తెలిపిన గంబీర్.. అందుకే ప్రస్తుతం టీమిండియా ఫీలింగ్ ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడ్డాయి అంటు తెలిపాడు. 

 


 టీమ్ ఇండియా లో అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతమంది బెస్ట్ ఫీల్డర్లు  ఉన్నప్పటికీ అందరికంటే జడేజా  అత్యుత్తమం  అంటూ కితాబిచ్చారు గౌతమ్ గంభీర్. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో రవీంద్ర జడేజానే  అత్యుత్తమ ఫీల్డర్  అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రవీంద్ర జడేజా జట్టుకు అవసరమైన ఎంతో నాణ్యమైన ఆల్రౌండర్ అంటూ ప్రశంసలు కురిపించాడు గౌతం గంభీర్. అవసరమైనప్పుడు బౌలింగ్తో బ్యాటింగ్తో మెరుపులు మెరిపించ గలడు  అంటూ చెప్పుకొచ్చాడ. ఇక ఎప్పుడు మైదానంలో మెరుపు ఫీలింగ్తో అందరిని మంత్రముగ్దుల్ని చేయగలడు అంటూ గంబీర్  తెలిపారు. ఏ ఫీలింగ్ పొజిషన్లో నుంచైనా వికెట్ల పైకి నేరుగా బంతి విసరగల సామర్థ్యం రవీంద్ర జడేజాకు మాత్రమే సాధ్యం అని.. ఎక్కడ బంతి అతడి చేయి దాటి పక్కకు పోదు అంటూ కితాబిచ్చాడు గౌతమ్ గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి: