గాల్వన్ లోయ ఘటన ప్రభావం ఐపీఎల్ స్పాన్సర్షిప్ లపై పడింది. ఈమెగాటోర్నీకి చైనా కు చెందిన మొబైల్ సంస్థ వివో టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఇందుకోసం బీసీసీఐకి  ఏడాదికి 440 కోట్లను చెల్లిస్తుంది. 2022 వరకు వివో ఒప్పందం చేసుకుంది. ఇక ప్రముఖ కంపెనీ పేటీఎం ఆన్ ఫీల్డ్ స్పాన్సర్ గా వుంది అయితే ఇటీవల  లఢక్ లోని గాల్వన్ లోయ వద్ద చైనా -భారత్ బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు  మరణించారు. దీనికి నిరసనగా భారత్ లో  చైనా సంస్థలను బహిష్కరించాలనే డిమాండ్లు  తెర మీదకు వచ్చాయి. అందులో భాగంగా ఐపిఎల్ కు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్న చైనా కంపెనీలకు కూడా ఉద్వాసన పలకాలని పెద్ద ఎత్తున్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దాంతో బీసీసీఐ ఆలోచనలో పడింది. వచ్చే వారంలో వీటిపై సమీక్ష జరుపుతామని ఐపీఎల్ పాలకమండలి ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 
ఇక వివోతో పాటు స్పానర్స్ గా వ్యవహరిస్తున్న తదితర  కంపెనీల వల్లే ప్రభుత్వానికి 45శాతం టాక్స్ వస్తుంది. దీనివల్ల భారత ఆర్థిక సంస్థకు మేలు జరుగుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఓ నిర్ణయం తీసుకోక తప్పదని బీసీసీఐ కోశాధికారి అరుణ ధూమాల్ వెల్లడించాడు. ఇక పేటీఎం భారత్ కు చెందిందే అయినా చైనా లో టాప్ కంపెనీ గా వెలుగొందుతున్న అలీబాబా దీంట్లో భారీగా పెట్టుబడులు పెట్టింది దాంతో పేటీఎం ను కూడా స్పాన్సర్ గా ఉపసంహరించుకోవాలని బీసీసీఐ భావిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: