కరోనా ఎవరిని  విడిచిపెట్టడం లేదు. క్రికెటర్లు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తౌఫిక్ ఉమర్ అలాగే మాజీ  స్టార్ ఆల్ రౌండర్  షాహిద్ ఆఫ్రిది లకు కరోనా సోకగా తాజాగా ముగ్గురు బంగ్లాదేశ్ క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. ఈముగ్గురిలో మాజీ కెప్టెన్ మష్రాఫె మోర్తజా కూడా వున్నాడు. అతనితో పాటు ఓపెనర్ నఫీస్ ఇస్లాం  , ఎడమచేతి వాటం స్పిన్నర్ నజముల్ ఇస్లాం లకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణయ్యింది.  
 
మోర్తజా పార్లమెంట్ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాడు ఈ క్రమంలో తన నియోజిక వర్గంలో  కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలబడి పలు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. మిగితా ఇద్దరు ఆటగాళ్లు కూడా  నిత్యావసర సరకులను అందిస్తూ పేద వాళ్ళకు అండగా వుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఈముగ్గురు కరోనా బారిన పడ్డారనిసమాచారం.
 
ఇక తనకు కరోనా సోకిందని మోర్తజా పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. కరోనా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని అభిమానులు.. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని మోర్తజా కోరాడు అలాగే బంగ్లాదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 100000 దాటింది. ఇప్పుడు మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ముఖ్యమైన పని ఉంటేనే బయటికి వెళ్ళండి లేదంటే  ఇంట్లోనే వుండండి  అని మోర్తజా సూచించాడు.
 
ఇదిలావుంటే  బంగ్లాదేశ్ వన్డే జట్టుకు  సుదీర్ఘ కాలం కెప్టెన్ గా వ్యవరించిన మోర్తజా ఈఏడాది మార్చి లో సొంత గడ్డ పై తో జింబాబ్వే తో జరిగిన మూడో వన్డే తరువాత కెప్టెన్సీ  నుండి తప్పుకున్నాడు. మోర్తజా స్థానం లో వన్డే జట్టుకు కెప్టెన్ గా తమీమ్ ఇక్బాల్ ను నియమించింది బంగ్లా క్రికెట్ బోర్డు. 

మరింత సమాచారం తెలుసుకోండి: