క్రీడా ప్రపంచంలో గొడవలు సర్వసాధారణం కాని కొన్ని పోలీస్ కేసులు, కోర్టు మెట్లు, క్రీడా బోర్డుకు క్షమాపణలు చెప్పడం వంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి సంఘటన చోటు చేసుకుంది. అవార్డుకు తన పేరును నామినేట్ చేయలేదని కోపంతో విమర్శించిన ఓ క్రీడాకారుడు..! 

 


భారత షట్లర్​ హెచ్​. ఎస్​ ప్రణయ్..​ భారత బ్యాడ్మింటన్​ సంఘం (బీఏఐ)ను క్షమాపణలు కోరాడు. ఇటీవలే అర్జున అవార్డుకు తనను సిఫార్సు చేయనందుకు బాయ్​పై విమర్శలు గుప్పించాడు ప్రణయ్. దీనిపై వివరణ ఇవ్వాలని షో కాజ్ నోటీసులు పంపించగా.. ప్రణయ్​ స్పందించాడు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు తారా స్థాయికి చేరుకొని ఎందరో చెవులు కొరుక్కున్నారు. అవార్డు గురించి అందులోనూ కేవలం నామినేషన్ కు పేరు సిఫారసు చేయలేదు అని ఇంత గొడవ అయితే అవార్డ్ ఇవ్వకపోతే ఇంకా ఎంత గొడవ అవుతుంది..?

 

 

అర్జున అవార్డుకు తన పేరును సిఫార్సు చేయకపోవడం వల్ల జాతీయ సమాఖ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత షెట్లర్​ హెచ్​.ఎస్ ప్రణయ్​... భారత బ్యాడ్మింటన్​ సంఘం (బీఏఐ)ను క్షమాపణలు కోరాడు. బీఏఐ అధ్యక్షుడు హిమంత విశ్వ శర్మ.. ప్రణయ్​ క్షమాపణను అంగీకరించారు. ఇటువంటి ఘటన పునరావృతం కాదని భావిస్తున్నట్లు జనరల్ సెక్రెటరీ అజయ్​ సింఘానియా పేర్కొన్నారు.మరోవైపు ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు భారత షట్లర్​ హెచ్​.ఎస్​ ప్రణయ్​ పేరును ప్రతిపాదించాలని సూచించారు బ్యాడ్మింటన్​ కోచ్​ పుల్లెల గోపిచంద్​.

 

జరిగిందేమిటంటే..

జూన్ 2న సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, సమీర్‌ వర్మ పేర్లను అర్జున అవార్డు కోసం కేంద్రానికి పంపించింది బాయ్​. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడటం వల్ల వరుసగా రెండో ఏడాది ప్రణయ్​ పేరును సిఫార్సు చేయలేదు బీఏఐ. ఈ నేపథ్యంలోనే అర్జున అవార్డుకు తన పేరును ప్రతిపాదించకపోవడం వల్ల ప్రణయ్​ విమర్శలు గుప్పించాడు. దీనిపై స్పందించిన బీఏఐ.. షోకాజ్​ నోటీసులను జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: