భారత టెస్టు క్రికెట్‌లో గొప్ప బ్యాట్స్‌మెన్‌ చాల మంది ఉన్నారు. అందులో మనకు గొప్ప బ్యాట్స్‌మెన్‌ అనగానే ముందుగా వినిపించే పేరు సచిన్ టెండూల్కర్. అయితే ఆ తర్వాత సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ ఇలా వరుసగా అందరు గుర్తుకు వస్తారు. అయితే కానీ.. గత 50 ఏళ్లలో భారత గొప్ప టెస్టు బ్యాట్స్‌మెన్ ఎవరు..? ఇదే ప్రశ్నతో విజ్డెన్ ఇండియా ఓ పోల్‌ని నిర్వహించగా ఎవరూ ఊహించని రీతిలో రాహుల్ ద్రవిడ్ విజేతగా నిలిచాడు.

 

 

పోల్‌లో మొత్తం 11,400 మంది అభిమానులు తమ అభిప్రాయాన్ని చెప్పగా.. రాహుల్ ద్రవిడ్‌కి ఏకంగా 52 శాతం ఓట్లు పడినట్లు విజ్డెన్ ఇండియా ప్రకటించింది. సచిన్ ఆఖరి వరకూ గట్టి పోటీనిచ్చినా రెండో స్థానానికి పరిమితమైనట్లు వెల్లడించిన విజ్డెన్ ఇండియా.. విరాట్ కోహ్లీ, సునీల్‌ గవాస్కర్ వరుసగా 3, 4 స్థానాలతో సరిపెట్టారు.

 

 

జగ్గర్‌నాట్ పబ్లికేషన్స్ భారత జట్టు టెస్ట్ మ్యాచ్‌లపై 'ఫ్రం ముంబై టు డర్బన్' అనే పుస్తకాన్ని ప్రచురించింది. దానిలో భారత్ టీమ్ చేసిన అద్భుత ప్రదర్శనలున్నాయి. రచయితలు ఎస్.గురునాథ్, వీ.జే.రఘునాథ్‌లు ఈ పుస్తకంలో 28 టెస్టు మ్యాచ్‌ల గురించి వివరించారు. 

 

 

టెస్ట్ క్రికెట్‌లో ద్రవిడ్‌ను ఓపెనింగ్ బ్యాటింగ్ చేయమన్నా చేసేవాడు. అలాగే కీపింగ్, ఫినిషర్‌గా జట్టుకు అవసరమైన సమయాల్లో తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేవాడు. భారత క్రికెట్‌పై ద్రవిడ్ ప్రభావం ఎక్కువే. వైట్ బాల్ క్రికెట్‌లో గంగూలీ ప్రభావం ఎక్కువే కానీ.. ఓవరాల్ క్రికెట్‌లో మాత్రం అందరి కన్నా ద్రవిడ్ ప్రభావమే ఎక్కువ.

 

 

భారత్ తరఫున 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇక రాహుల్ ద్రవిడ్ 164 టెస్టులాడి 52.31 సగటుతో 13,288 రన్స్ చేయగా.. సునీల్ గవాస్కర్ 125 టెస్టుల్లో 51.12 సగటుతో 10,122 పరుగులు చేశాడు. ఆఖరిగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన 86 టెస్టుల్లోనే 53.62 సగటుతో 7,240 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: