నాలుగు నెలల సుదీర్ఘ విరామం అనంతరం జులై లో అంతర్జాతీయ క్రికెట్ పున :ప్రారంభం కానుంది. అందులో భాగంగా ఇంగ్లాండ్ ,వెస్టిండీస్ ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం విండీస్ ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకోగా ప్రస్తుతం విండీస్ ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్  మ్యాచ్ ఆడుతున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా ప్రాక్టీస్ లో బిజీ గా గడుపుతున్నారు.
 
ఇక కరోనా భయంతో షెడ్యూల్ ప్రకారం జరుగాల్సిన  సిరీస్ లు వాయిదాపడుతుంటే .. ఈటెస్టు సిరీస్ కు మాత్రం  లైన్ క్లియర్ అయ్యినట్లే కనిపిస్తుంది. జూన్ 3నుండి ఈసీబీ ( ఇంగ్లాండ్ ఆండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) 702 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ వచ్చింది. ఇందులో ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ ,హోటల్ స్టాఫ్ అలాగే గ్రౌండ్ స్టాఫ్ వున్నారు దాంతో సిరీస్ సజావుగా సాగడానికి దాదాపుగా అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లే. ఈసిరీస్ బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా జరుగనుంది. ఇండియాలో ఈ సిరీస్ ను సోనీ సిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 
 
జులై 8న సౌతాంఫ్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు  జరుగనుంది. అనంతరం మాంచెస్టర్ లో మిగిలిన రెండు టెస్టులు జరుగనున్నాయి. ఈటెస్టు సిరీస్ కు 21 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది క్రికెట్ వెస్టిండీస్. ఇందులో 14మంది జట్టు సభ్యులు కాగా మరో 11మందిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికచేసింది అయితే ఇంగ్లాండ్ ఇంకా స్క్వాడ్ ను ప్రకటించాల్సివుంది. ఇక సొంత గడ్డపై జరుగుతుండడం అలాగే విండీస్ జట్టులో ఒకరు, ఇద్దరు తప్ప దాదాపు అందరు కొత్త వారే కావడంతో ఇంగ్లాండ్ కు సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: