పాకిస్థాన్ క్రికెట్ జట్టులో రెండు రోజుల క్రితం 10మంది క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు అయితే ఇందులో సీనియర్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ నిన్నరెండో సారి టెస్టు చేయించుకోగా నెగిటివ్ వచ్చిందని ప్రకటించి పీసీబీకి షాక్ ఇచ్చాడు దాంతో రేపు ఆటగాళ్ళందరికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నామని పీసీబీ ప్రకటించింది. కాగా రెండో సారి టెస్టు చేయించుకున్న మహమ్మద్ హఫీజ్ పై పీసీబీ సీఈఓ వసీం ఖాన్ ఫైర్ అయ్యాడు. కనీసం మాకు చెప్పకుండా మరోసారి టెస్టు చేయించుకోవడం.. మళ్ళీ దాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించడం రూల్స్ ను అతిక్రమించడమేనని అన్నాడు. ఇంతకుముందు కూడా హఫీజ్ నిబంధనలను అతిక్రమించాడు. హఫీజ్ సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాడు కాదు కానీ ఇంగ్లాండ్ టూరు కు ఎంపికైన నేపథ్యంలో రూల్స్ పాటించాలని మండిపడ్డాడు. 
 
ఇక ఈనెల 28న పాక్ జట్టు ఇంగ్లాండ్ కు వెళ్లనుంది అనంతరం జట్టు సభ్యులు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నారు. ఆగస్టు - సెప్టెంబర్ లో పాక్ ,ఇంగ్లాండ్ తో మూడు టెస్టులు, మూడు టీ 20ల్లో తలపడాల్సివుంది. ఈపర్యటన కు మొత్తం 29మంది ఆటగాళ్లతో కూడిన జట్టు ను ప్రకటించింది పీసీబీ.
 
ఇందులో హఫీజ్ గాక మరో 9మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో వీరు పర్యటనకు దూరమయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఈ పర్యటనుండి స్టార్ బౌలర్ మహమ్మద్ అమీర్  మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ హారిస్ సోహైల్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నారు. ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు  లార్డ్స్ లో జరుగనుండగా  మిగిలిన రెండు టెస్టులు మాంచెస్టర్ ,నాటింగ్హోమ్ లో జరుగనున్నాయి అలాగే మూడు టీ 20లు లీడ్స్ ,కార్డిఫ్ ,సౌతాంఫ్టన్ వేదికల్లో జరుగనున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: