ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ కు వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ ఆడడానికి  లైన్ క్లియర్ అయ్యింది. తాజాగా ఆర్చర్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా  నెగిటివ్ వచ్చింది దాంతో రేపు ఏజెస్ బౌల్ లో జట్టుతో కలిసి ఆర్చర్ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఇక కరోనా వల్ల గత కొంత కాలంగా స్థంభించిపోయిన క్రికెట్ సుదీర్ఘ విరామం అనంతరం వెస్టిండీస్ -ఇంగ్లాండ్ మొదటి టెస్టుతో పున :ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగనుండగా మొదటి టెస్టు  జులై 8న సౌతాంఫ్టన్ వేదికగా జరుగనుంది. మిగిలిన రెండు టెస్టులు మాంచెస్టర్ లో జరుగనున్నాయి.
 
ఈ సిరీస్ కోసం విండీస్ ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకోగా ప్రస్తుతం విండీస్ ఆటగాళ్లు  రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇక ఈ సిరీస్ కోసం ఈసీబీ ( ఇంగ్లాండ్ ఆండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందులో భాగంగా ఆటగాళ్ల తో సహా మొత్తం 702 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ వచ్చింది. ఈసిరీస్ బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా జరుగనుంది.
 
ఇదిలావుంటే మిగిలిన దేశాలు మాత్రం కరోనా కు భయపడి షెడ్యూల్ ప్రకారం జరుగాల్సిన సిరీస్ లను  వాయిదావేసుకుంటున్నాయి. ఇప్పటివరకు నాలుగు సిరీస్ లు వాయిదాపడ్డాయి. అందులో జులై లో శ్రీలంక - భారత్ ల మధ్య జరుగనున్నసిరీస్ తోపాటు  న్యూజిలాండ్ , బంగ్లాదేశ్ మధ్య జరుగాల్సిన టెస్టు సిరీస్ రద్దు కాగా ఆగస్టు లో బంగ్లాదేశ్ - శ్రీలంక మధ్య జరగాల్సిన టెస్టు సిరీస్ తోపాటు భారత్ -జింబాంబ్వే  మధ్య జరుగాల్సిన వన్డే సిరీస్ కూడా రద్దయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: