ఇంగ్లాండ్ టూర్ కు ఎంపికైన పాకిస్థాన్  జట్టులో ఇటీవల 10మందికి  కరోనా పాజిటివ్ వచ్చిందని పీసీబీ అధికారికంగా ప్రకటించింది దాంతో ఇంగ్లాండ్ ,పాక్ తో జరిగే సిరీస్ ను రద్దు చేసుకుంటుందని ఊహాగానాలు వెలుబడ్డాయి అయితే ఇంగ్లాండ్  ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పాక్ తో సిరీస్ షెడ్యూల్ ప్రకారమే  కొనసాగుతుందని తాజాగా ఈసీబీ స్పష్టం చేసింది. ఈనెల 28న పాక్ జట్టు ఇంగ్లాండ్ కు చేరుకుంటుంది  అనంతరం 14 రోజుల పాటు వర్సెస్టర్ లో ఐసోలేషన్ లో ఉండనున్నారు ఆ తరువాత జులై 14నుండి డర్బిషైర్ లో టెస్టు మరియు టీ 20సిరీస్ కోసం ప్రాక్టీస్ చేయనున్నారని ఈసీబీ ప్రకటించింది.
 
ఇక ఈపర్యటనలో ఆతిథ్య జట్టు తో పాక్ మూడు టెస్టులు ,మూడు టీ 20ల్లో తలపడనుంది. ఆగస్టు లో మొదటి టెస్టు లార్డ్స్ లో జరుగనుండగా మిగిలిన రెండు టెస్టులు మాంచెస్టర్ ,నాటింగ్హోమ్ లో జరుగనున్నాయి అలాగే మూడు టీ 20లు లీడ్స్ , కార్డిఫ్ ,సౌతాంఫ్టన్ వేదికల్లో జరుగనున్నాయి. మొత్తం ఈపర్యటన కోసం పీసీబీ 29మంది ఆటగాళ్లను ఎంపికచేసింది వీరిలో ప్రస్తుతం 10మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది దాంతో ఈ ఆటగాళ్లు మినహా మిగితా జట్టు సభ్యులు ఇంగ్లాండ్ కు వెళ్లనున్నారు.  
 
ఇదిలావుంటే జులై 8న సౌతాంఫ్టన్ వేదికగా ఇంగ్లాండ్ - వెస్టిండీస్ మధ్య జరుగనున్న మొదటి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈసిరీస్ కోసం విండీస్ ఇంగ్లాండ్ కు చేరుకొని ప్రాక్టీస్ ను మొదలు పెట్టింది. ఈటెస్టు సిరీస్ కు 21 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది క్రికెట్ వెస్టిండీస్. ఇందులో 14మంది జట్టు సభ్యులు కాగా మరో 11మందిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికచేసింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: