కరోనా,జింబాబ్వే క్రికెట్ బోర్డు పాలిట శాపంలా మారింది. అసలే ఆర్థిక కష్టాలతో అవస్థలు పడుతుండగా ఆగస్టు లో రెండు టాప్ టీం లతో జరుగాల్సిన సిరీస్ లు రద్దు చేసి కరోనా ,జింబాబ్వే ఆశలపై నీళ్లు చల్లింది. ఆగస్టు చివర్లో ఇండియా ,మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం జింబాబ్వే లో పర్యటించాల్సి వుంది అయితే కరోనా వల్ల  ఈసిరీస్ ను వాయిదావేసుకున్నట్లు ఇటీవల బీసీసీఐ ప్రకటించింది.
 
ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగాల్సిన సిరీస్ కూడా వాయిదాపడింది. అదే ఆగస్టు లో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం జింబాబ్వే ,ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి వుంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9, 12,15న ఆతిథ్య జట్టు తో జింబాబ్వే మూడు వన్డేలు ఆడాల్సివుంది కానీ కరోనా వల్ల ఈసిరీస్ ను వాయిదావేసుకుంటున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది దాంతో జింబాబ్వేకు దెబ్బ మీద మీద పడింది. 
 
ఇక ఈసిరీస్ కాకుండా ఆసీస్ ఇప్పటికే న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ తో జరుగనున్నసిరీస్ లను వాయిదావేసుకుంది కాగా ఇంగ్లాండ్ తో సెప్టెంబర్ లో  సిరీస్ ఆడడానికి ఆస్ట్రేలియా ఆసక్తిగా వుంది.  ఆతరువాత ఇండియా తో సొంత గడ్డపై వన్డే ,టీ 20 సిరీస్ లలో తలపడనుంది ఆస్ట్రేలియా. ఇదిలావుంటే కరోనా నేపథ్యంలో మిగితా దేశాలు షెడ్యూల్ ప్రకారం జరుగాల్సిన సిరీస్ లను వాయిదా వేసుకుంటుండగా ఇంగ్లాండ్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అందులో భాగంగా వెస్టిండీస్ తో సొంత గడ్డపై టెస్టు సిరీస్ లో తలపడానికి రెడీ అవుతుంది. మరో 8రోజుల్లో ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు జరుగనుంది. ఈసిరీస్ ముగిశాక ఇంగ్లాండ్ ,పాకిస్థాన్ తో టెస్టు ,టీ 20 సిరీస్ ఆడనుంది ఇందుకోసం నిన్ననే పాక్ ,ఇంగ్లాండ్ కు చేరుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: