ఇంగ్లాండ్ పర్యటన కోసం ఇటీవల పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) 29మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది అయితే వీరందరికి కరోనా టెస్టులు నిర్వహించగా అందులో 10మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఈనెల 26న రెండో సారి ఆటగాళ్లందరికి టెస్టులు చేయగా మొదటి సారి పాజిటివ్ వచ్చిన 10మంది ఆటగాళ్ల లో 6గురు ఆటగాళ్లు.. హఫీజ్ ,రియాజ్ ,హస్నైన్ ,రిజ్వాన్ ,ఫకర్ జమాన్ ,షాదాబ్ ఖాన్ లకు నెగిటివ్ వచ్చింది దాంతో మరోసారి నిన్న ఈఆరుగురికి కరోనా టెస్టులు చేయగా మళ్ళీ నెగిటివ్ వచ్చిందని త్వరలోనే వీరు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారని పీసీబీ ప్రకటించింది. 
ఇక  20మందితో కూడిన పాక్ జట్టు నిన్న ఉదయం మాంచెస్టర్ కు చేరుకుంది. 14రోజుల ఐసొలేషన్ అనంతరం వచ్చే నెల 13నుండి డర్బి షైర్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. ఈటూరు లో ఆతిథ్య జట్టు తో పాక్ ,మూడు టెస్టులు ,మూడు టీ 20ల్లో తలపడనుంది. మొదటి టెస్టు లార్డ్స్ లో జరుగనుండగా  మిగిలిన రెండు టెస్టులు మాంచెస్టర్ ,నాటింగ్హోమ్ లో జరుగనున్నాయి అలాగే మూడు టీ 20లు లీడ్స్ , కార్డిఫ్ ,సౌతాంఫ్టన్ వేదికల్లో జరుగనున్నాయి. ఇదిలావుంటే ప్రస్తుతం ఇంగ్లాండ్ ,వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ కు రెడీ అవుతుంది. వచ్చే నెల 8న ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈటెస్టు సిరీస్ ముగిశాక ఇంగ్లాండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: