కరోనా వల్ల గత నాలుగు నెలల నుండి స్థంభించిపోయిన అంతర్జాతీయ క్రికెట్ మరో ఆరు రోజుల్లో తిరిగి ప్రారంభం కానుంది అందులో భాగంగా  సౌతాంఫ్టన్ వేదికగా ఈనెల 8నుండి వెస్టిండీస్-ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం మూడు టెస్టులు జరుగనుండగా ఈ సిరీస్ కు విండీస్ ఆటగాళ్లు.. బ్లాక్ లీవ్స్ మ్యాటర్ అనే లోగో వున్న జెర్సీలను ధరించనున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆటగాళ్లు ఈలోగో వున్న జెర్సీలతో బరిలోకి దిగనున్నారు ఇక ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ సిరీస్ లో తమ టీషర్ట్ లపై బ్లాక్ లీవ్స్ మ్యాటర్ లోగో ను ముద్రించుకొని బరిలోకి దిగనుందని ఈసీబీ వెల్లడించింది. 
 
ఇదిలావుంటే మొదటి టెస్టు కు ఇంగ్లాండ్ కెప్టెన్  జో రూట్ దూరం కానున్నాడు. ఈ వారంలో రూట్ సతీమణి రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో రూట్ మొదటి టెస్టు కు అందుబాటులో ఉండడం లేదు. రూట్ తప్పుకోవడంతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ ,వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.కెప్టెన్ గా స్టోక్స్ కు ఇదే మొదటి మ్యాచ్ కాగా కీపర్ జాస్ బట్లర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
 
ఇక ఈటెస్టు సిరీస్ కు మొత్తం 21మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది క్రికెట్ వెస్టిండీస్. ఇందులో14మంది జట్టు సభ్యులు కాగా మరో 11మందిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఉండనున్నారు అయితే సొంత గడ్డపై ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంటే అనుభవం లేని ఆటగాళ్లతో విండీస్ బలహీనంగా వుంది. మరి ఇంగ్లాండ్ కు విండీస్ ఎంత వరకు పోటీనిస్తుందో చూడాలి. ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్  వెస్టిండీస్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: