బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రాఫె మోర్తజాను కరోనా విడిచిపెట్టడం లేదు. గత నెల 20న తనకు కరోనా సోకిందని.. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండంటూ మోర్తజా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు అప్పటినుండి అతను చిక్సిత తీసుకుంటున్నాడు. ఇక ఈరోజు మరోసారి మోర్తజాకు కరోనా పరీక్షలు నిర్వహించగా మరోసారి పాజిటివ్ అనే వచ్చింది అయితే రెండో సారి పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) ఫిజీషియన్ దేబాశిష్ చౌదరి అన్నారు.
 
చాలా కేసుల్లో కరోనా సోకిన వ్యక్తులు 14రోజుల్లో కోలుకుంటారు కానీ అది తప్పనిసరి కాదు కొందరు ఇంకాస్త సమయం తీసుకుంటారు. రెండో సారి పాజిటివ్ వచ్చినంత మాత్రాన మోర్తజా విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు ఈనెల 8న మోర్తజాకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్న చౌదరి ఆ పరీక్షల్లో నెగిటివ్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 
 
ఇక మోర్తజాతో మరో ఇద్దరు బంగ్లా క్రికెటర్లు ఓపెనర్ నఫీస్ ఇస్లాం,ఎడమచేతి వాటం స్పిన్నర్ నజముల్ ఇస్లాంలు కూడా ఈవైరస్ బారిన పడగా ప్రస్తుతం వారిద్దరూ కోలుకున్నారని సమాచారం అలాగే ఇటీవల పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదికి కూడా కరోనా సోకగా అతను కూడా పూర్తిగా కోలుకున్నాడు .
 
ఇక ఇంగ్లాండ్ పర్యటన వెళ్లేముందు పాకిస్థాన్ ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించగా అందులో ఏకంగా 10మందికి కరోనా పాజిటివ్ అని తేలింది అయితే  కొన్నిరోజుల తరువాత మరో సారి పరీక్షలు నిర్వహిస్తే అందులో ఆరుగురికి నెగిటివ్ వచ్చింది దాంతో వారు ఇంగ్లాండ్ టూరు కు వెళ్లగా మిగితా నలుగురు క్రికెటర్లు మాత్రం ప్రస్తుతం చిక్సిత తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: