శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం 5:30 గంటల ప్రాతంలో పనదురాలో సైక్లింగ్ చేస్తున్న 64 ఏళ్ళ వ్యక్తిని మెండిస్ నడుపుతున్న కారు ఢీ కొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు దాంతో పోలీసులు కేసు నమోదు చేసి మెండిస్ ను స్టేషన్ కు తరలించారు. కాసేపట్లో అతనికి వైద్య పరీక్షలు చేసి కోర్టు లో హాజరుపరచనున్నారు.  మెండిస్ అరెస్టు విషయాన్నికొలంబో పోలీసులు ధ్రువీకరించారు ఈమేరకు అధికారికంగా ఓ లేఖను కూడా విడుదలచేశారు.  
ఇక శ్రీలంక టీంలో ఇప్పుడిప్పుడే రెగ్యులర్ ఆటగాడికి నిలదొక్కుకుంటున్న మెండిస్ కు తాజా ఘటన షాక్ ఇచ్చింది. మొత్తం ఇప్పటివరకు శ్రీలంక తరుపున మెండిస్ 44 టెస్టులకు,76 వన్డేలకు అలాగే 26 టీ 20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 37 సగటు తో టెస్టుల్లో 2995 పరుగులు చేయగా 30 సగటుతో  వన్డేల్లో 2167 పరుగులు చేశాడు. టీ 20ల్లో18.6 సగటుతో 484 పరుగులు చేశాడు. ఇదిలావుంటే షెడ్యూల్ ప్రకారం ఈనెలలో శ్రీలంక సొంత గడ్డపై భారత్ తో వన్డే, టీ 20 సిరీస్లో తలపడాల్సి వుంది కానీ కరోనా వల్ల ఈపర్యటన వాయిదావేసుకుంది బీసీసీఐ. 

మరింత సమాచారం తెలుసుకోండి: