దేశములో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దీని కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. అయితే లాక్ డౌన్ కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఐపిల్ మ్యాచులు రద్దు చేశారు. అయితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఆడుతున్నప్పుడు సహచర ఆటగాళ్లతో చేతులు కలపలేం. అలా చేసే సందర్భం వచ్చినప్పుడు వెనక్కితగ్గాల్సి వస్తుంది. ఈ విషయం ఆలోచిస్తేనే విచిత్రంగా అనిపిస్తోంది’’ అని కోహ్లీ అన్నారు.

 

 

వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ, ఇలాగే జరుగుతుంది. కరోనావైరస్‌కు వ్యాక్సిన్ లేదా చికిత్స కనిపెట్టేవరకైనా ఈ పరిస్థితి తప్పదు’’ అని అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో చోటు చేసుకునే మార్పులను స్వీకరించడంలో ఇబ్బందులేమీ ఉండవని కోహ్లీ అన్నారు. మనందరికీ ఇదంతా విచిత్రంగానైతే అనిపిస్తుంది. కానీ, జీవితంలో దీన్ని భాగం చేసుకోవడం కష్టమేమీ కాదు.

 

 

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని రెచ్చగొట్టే ప్రయత్నాలకు దూరంగా ఉంటామని ఆస్ట్రే‌లియా పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ చెప్పాడు.   కోహ్లీ బ్యాటింగ్‌ చేసే సమయంలో తమ జట్టు ఆటగాళ్లెవరూ అతడిని కవ్వించే ప్రయత్నం చేయరని అన్నాడు.  కోహ్లీని రెచ్చగొడితే అతనిలోని  అత్యుత్తమ ఆట బయటకొస్తుందని అది మాకు మరింత ప్రమాదకరమని తెలిపాడు.

 

 

షెడ్యూల్‌ ప్రకారం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు  ఆస్ట్రేలియా పర్యటనకు వస్తే తమ పేస్‌దళం అప్రమత్తంగా ఉండాలని హేజిల్‌వుడ్‌ వ్యాఖ్యానించాడు.  'విరాట్‌ను రెచ్చగొడితే ఏమవుతుందో 2018 సిరీస్‌లోనే మాకు అర్థమైంది. అతడు కూడా ఆటలో పోటీని బాగా ఇష్టపడతాడు. బ్యాటింగ్‌ చేసే సమయంలో అతడిని కవ్విస్తే మరింత చెలరేగిపోతాడని' హేజిల్‌వుడ్‌ పేర్కొన్నాడు. 

 

 

నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా డిసెంబర్‌లో ఆసీస్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. డిసెంబర్‌ 3న బ్రిస్బేన్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో తొలి టెస్టు జరగనుంది. డిసెంబర్‌ 11 నుంచి 15 మధ్య అడిలైడ్‌లో డే-నైట్‌ టెస్టులోనూ కోహ్లీసేన తలపడాల్సి ఉందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: