యాక్సిడెంట్ కేసులో నిన్న ఉదయం అరెస్టు అయిన శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్ కు పనదూర మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.10లక్షలరూపాయలను బాధిత కుటుంబానికి ఇవ్వడానికి ఒప్పుకోవడంతో మెండిస్ కు బెయిల్ లభించింది అందులో భాగంగా కోర్టులోనే బాధిత కుటుంబానికి మెండిస్ 2లక్షలు ఇచ్చాడని సమాచారం.
 
ఇక నిన్న ఉదయం 5:30 గంటల సమయంలో పన దూర లోని ఓల్డ్ గాలే రోడ్డు పై సైక్లింగ్ చేస్తున్న 64 ఏళ్ళ వ్యక్తిని కుశాల్ మెండిస్ నడుపుతున్న కారు ఢీ కొట్టడంతో ఆ వ్యక్తి మరణించాడు దాంతో పోలీసులు,మెండిస్ కారు ను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. అనంతరం స్టేషన్ కు తరలించారు. ఈరోజు ఉదయం మెండిస్ ను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి  బెయిల్ మంజూరు చేసింది. కాగా డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మెండిస్ నిద్రమత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 
 
ఇక ఇప్పటివరకు శ్రీలంక తరుపున 44 టెస్టులు,76 వన్డేలు అలాగే 26 టీ 20లకు కుశాల్ మెండిస్ ప్రాతినిధ్యం వహించాడు. మరి మొత్తానికి బెయిల్ తో బయటపడ్డ కుశాల్ మెండిస్ పై శ్రీలంక క్రికెట్ బోర్డు ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా చూడాలి. ఇదిలావుంటే మార్చి లో సొంత గడ్డపై శ్రీలంక ,ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో తలపడాల్సివుంది అయితే అప్పటికే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఇంగ్లాండ్ ఆ సిరీస్ ను అర్థాంతరంగా రద్దు చేసుకొని స్వదేశం వెళ్ళిపోయింది.  ప్రస్తుతం శ్రీలంకలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గింది. అయితే ఇదే నెలలో ఇండియా ,శ్రీలంక లో పర్యటించాల్సివుంది కానీ కరోనా వల్ల ఈ పర్యటన వాయిదాపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: