గత నాలుగు నెలల నుండి స్థంభించిపోయిన అంతర్జాతీయ క్రికెట్ ఎట్టకేలకు ఈరోజు తిరిగి ప్రారంభం అవుతుందనుకుంటే వరణుడు అడ్డంకిగా మారాడు. సౌతాంఫ్టన్ వేదికగా వెస్టిండీస్-ఇంగ్లాండ్ ల మధ్య మరి కొద్దీ సేపట్లో మొదటి టెస్టు ప్రారంభం కావాల్సి ఉండగా ప్రస్తుతం వర్షం పడుతుండడంతో టాస్ ఆలస్యం కానుంది. దాంతో మ్యాచ్ ఆలస్యంగా స్టార్ట్ కానుంది.
 
మొదటి సారి బయో సెక్యూర్ వాతావరణంలో సరికొత్త రూల్స్ నడుమ ప్రేక్షకులు ఎవరులేకుండా జరుగనున్న ఈమ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈపర్యటనలో ఆతిథ్య జట్టుతో విండీస్ మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తలపడనుంది. కరోనా భయంతో విండీస్ స్టార్ ఆటగాళ్లు డారెన్ బ్రావో ,హేట్మేయర్ , కీమో పాల్ ఈ సిరీస్ కు దూరంగా వున్నారు. 
 
ఇక మొదటి టెస్టుకు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్ గా స్టోక్స్ కు ఇదే మొదటి మ్యాచ్ కానుండడం విశేషం కాగా కీపర్ జాస్ బట్లర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 
 
వెస్టిండీస్ జట్టు (అంచనా): జాసన్ హోల్డర్ (కెప్టెన్), బ్రాత్ వెయిట్ , రోస్టన్ ఛేజ్  ,బ్రూక్స్ ,క్యాంప్ బెల్,కార్న్ వాల్ , షేన్ డౌరిచ్ ,హోప్ ,అల్జారీ జోసెఫ్ , కీమర్ రోచ్, గాబ్రియల్ 
 
ఇంగ్లాండ్ జట్టు (అంచనా): స్టోక్స్(కెప్టెన్), బట్లర్ (వైస్ కెప్టెన్/ కీపర్), అండర్ సన్ , ఆర్చర్ ,మార్క్ వుడ్ , జాయ్ డెన్లీ ,  రోరీ బర్న్స్ ,ఓల్లి పోప్ , సిబ్లే , జాక్ క్రాలే,  డామ్ బెస్ 

మరింత సమాచారం తెలుసుకోండి: