గతేడాది జరిగిన ప్రపంచకప్లో తొలిసారి వన్డే ప్రపంచకప్ను ముద్దాడింది ఇంగ్లాండ్. ఫైనల్లో న్యూజిలాండ్పై జరిగిన పోరులో బౌండరీ కౌంట్ రూల్ ఆధారంగా విజేతగా నిలిచింది. తుది పోరులో ఇంగ్లీష్ ఆటగాడు బెన్ స్టోక్స్ 84 నాటౌట్ (98 బంతుల్లో) అద్భుత పోరాటం చేశాడు. అయితే ఈ మ్యాచ్లోని సూపర్ ఓవర్ ముంగిట ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్ కాల్చాడట. సాధరణ సిరీస్లు, టోర్నీల్లోనే ఫైనల్ అనగానే ఒత్తిడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఇక ప్రపంచకప్ అంటే చెప్పక్కర్లేదు. తుది పోరులో ఒక్కసారి టైటిల్ గెలవని జట్లు పోటీపడితే... కచ్చితంగా కప్పుగెలవాలన్న ఆరాటానికి మైదానంలో ప్రేక్షకులే కాదు ఆటగాళ్లూ నరాలు తెగే ఉత్కంఠలో భాగస్వాములవ్వాల్సిందే.


గతేడాది జరిగిన ప్రపంచకప్లో జరిగింది ఇదే. నాలుగు దశాబ్దాల తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలవగా.. రన్నరప్గా నిలిచిన కివీస్ జట్టు రెండోసారి ఫైనల్లో ఓటమిని మూటగట్టుకుంది. మ్యాచ్లో జట్టు స్కోర్లు సమం కావడం వల్ల సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది ఆ సమయంలో చిన్న బ్రేక్ ఇవ్వగా.. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ సిగరెట్ కాల్చి వచ్చాడట. అంతేకాకుండా చిన్నపాటి తలస్నానం చేసేశాడట. ఈ విషయాన్ని 'మోర్గాన్స్ మెన్ ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇంగ్లాండ్స్ రైజ్ ఫ్రం క్రికెట్ వరల్డ్కప్ హ్యుమిలియేషన్ టూ గ్లోరీ' అనే బుక్లో రాశారు రచయితలు నిక్ హౌల్ట్, స్టీవ్ జేమ్స్. ఇది తాజాగా మార్కెట్లోకి వచ్చింది.


ఈ మ్యాచ్లో చివరి వరకు ఒంటరిపోరాటం చేసి ఇంగ్లీష్ జట్టుకు చిరకాల స్వప్నం నెరవేర్చాడు స్టోక్స్. అద్భుత ఇన్నింగ్స్(98 బంతుల్లో 84*)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌-ఇంగ్లీష్‌ జట్లు తలపడ్డాయి నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఇరు జట్లూ సమాన స్కోర్‌ చేయడం వల్ల మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. అక్కడా రెండు జట్లు నువ్వా నేనా అనే రీతిలో పోరాడగా.. చివరికి ఇందులో కూడా స్కోర్లు సమమయ్యాయి. చేసేది లేక బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. ఇంగ్లాండ్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ మ్యాచ్‌కు నేటితో ఏడాది పూర్తయింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: