ఐపీఎల్ 2020 సీజన్ ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. దాదాపు ఆరు నెలల నుంచి క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కు దూరంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులందరూ ఐపీఎల్తో ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ చూస్తూ  అందరూ మై మర్చిపోతున్నారు. ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తెర మీదికి వస్తూ  తమ అద్భుతమైన ప్రతిభతో ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే.




 అయితే సాధారణంగా అయితే ఈ ఐపీఎల్ సీజన్ బీసీసీఐ సెలక్టర్లకు  ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత టీమ్ ఇండియా జట్టు ఆడే మ్యాచ్ లలో ఆటగాళ్ళని  సెలెక్ట్ చేయాలి అనే విషయం ఐపీఎల్ సీజన్ లో రాణించిన ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకోవడం తో బిసిసిఐ కలెక్టర్లకు ఎంతో సులభం గా మారిపోతుంది. ఎంతో మంది యువ ఆటగాళ్లు  కూడా టీమిండియాలో అవకాశం పొందుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్లో ఇప్పటికే భారత జట్టులో స్థానం సంపాదించిన ఆటగాళ్లు  అద్భుతంగా రాణిస్తూ ఉండగా యువ ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు.



 ఈ క్రమంలోనే ఐపీఎల్ తర్వాత టీమిండియా జట్టు సెలెక్షన్ విషయం ప్రస్తుతం బీసీసీఐకి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా భారత ఓపెనర్లు విషయంలో అయితే బిసిసిఐకి చిక్కు వచ్చి పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ లో  కె.ఎల్.రాహుల్ అద్భుతంగా రాణిస్తూ సెంచరీలు బాదుతూన్నాడు.. అదే సమయంలో శిఖర్ ధావన్ కూడా ఢిల్లీ కాపిటల్ జట్టులో కీలక ఆటగాడిగా ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు... మరోవైపు మయాంక్ అగర్వాల్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. వీరు ముగ్గురు ఓపెనర్లు.. అయితే ఐపీఎల్ తర్వాత ఈ ముగ్గురిలో టీమిండియాకి  ఎవరిని  సెలెక్ట్ చేయాలి అన్నది బిసిసిఐకి ఒక చిక్కుముడి లా మారిపోయింది అని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: