ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. చివరి వరకు ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులందరూ అద్భుత ఇన్నింగ్స్ తో  ప్రతి మ్యాచ్లో కూడా ఆశ్చర్యపోతున్న విషయం తెలిసిందే. ఇక నిన్న చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ కాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్ రెచ్చిపోయి ఆడింది అని చెప్పాలి. భారీగా బౌండరీలు బాదుతూ భారీ స్కోరు చేసింది. గతంలో గణాంకాలు చూస్తే ఆ మైదానంలో ఆడిన మ్యాచ్ లలో  ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఎక్కువగా విజయం సాధించిన గా దాఖలాలు ఉన్నాయి  దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.




 కానీ చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతంగా రాణించి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య చివరి బాల్ వరకు ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రేక్షకులు అందరిలో నెలకొంది. కానీ చివరికి ఈ హోరాహోరీ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్లు పూర్తి ఆధిపత్యం సంపాదించారు. శిఖర్ ధావన్ అయితే ఏకంగా సెంచరీతో చెలరేగడంతో ఢిల్లీకి విజయం ఎంతో సునాయాసంగా మారిపోయింది అని చెప్పాలి. దీంతో చెన్నై జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారిపోయింది.



 సాధారణంగా అయితే చెన్నై జట్టు ఐపీఎల్ లో రంగంలోకి దిగిన ప్రతి సారి కూడా ప్లే ఆప్ కు అర్హత సాధిస్తూ  ఉంటుంది. చివరకు ఎప్పుడూ కూడా చెన్నై జట్టు లీగ్  దశతో సరిపెట్టుకుని వెనుదిరిగిన దాఖలాలు లేవు. కానీ ఈ సారి మాత్రం లీగ్ దశతో  సరిపెట్టుకోకతప్పదు అనే విధంగా మారిపోయింది పరిస్థితి. ఇక నిన్న ఓటమితో తర్వాత మ్యాచుల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిన ప్రతి వచ్చింది. లేకపోతే ప్లే ఆప్ కు ఆశలు సజీవంగా ఉండే అవకాశం లేదు. ఇక ప్రస్తుతం చెన్నై జట్టు కూర్పు ఆట  తీరు చూస్తే అది సాధ్యమయ్యే లాగ మాత్రం కనిపించడం లేదు. దీంతో చెన్నై జట్టు తర్వాత మ్యాచ్ లలో  ఎలా ఆడుతుంది  అన్నది ప్రస్తుతం అభిమానులకు కూడా ఒక ప్రశ్నగానే మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: