ఈసారి డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగింది సన్రైజర్స్ జట్టు. కానీ  మునుపటిలా అంచనాలకు తగ్గట్లుగా జట్టు మొదటినుంచి ప్రదర్శన చేయడం లేదు అన్న విషయం తెలిసిందే. ఒక మ్యాచ్ లో  సన్రైజర్స్ జట్టు మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చింది అనిపించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ పేలవ ప్రదర్శనతో ఓటమి చవి చూస్తుంది. ఇలా ఈ ఏడాది ఐపీఎల్లో పడుతూ లేస్తూ తమ ప్రస్థానాన్ని పేలవంగానే కొనసాగిస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే నేడు కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎంతో కీలకంగా మారనుంది.



 గత నాలుగు మ్యాచ్ లలో  కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ టు ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఈరోజు జరగబోయే మ్యాచులో కోల్కతాను  ఓడించాల్సి  ఉంటుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానానికి చేరుకునే  అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే ఇక మిగతా మ్యాచ్ లు అన్నింటిలో  తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి సన్రైజర్స్ హైదరాబాద్ కు ఏర్పడుతుంది. కాగా నేడు అబుదాబి వేదికగా మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై హైదరాబాద్ జట్టు అభిమానులందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరోసారి హైదరాబాదు జట్టు బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో అద్భుతంగా రాణించి కోల్కతా నైట్రైడర్స్ జట్టుపై ఘనవిజయం సాధించాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక నేడు జరగబోయే మ్యాచులు బౌలింగ్ విభాగంలో సందీప్ శర్మ నటరాజన్ రషీద్ ఖాన్ కీలకం కానుండగా..  బ్యాటింగ్ విభాగంలో మొదట ఓపెనర్లు తోపాటు మనీష్ పాండే విలియంసన్ కూడా రాణిస్తే జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: