ఐపీఎల్ సీజన్ లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులందరినీ నిరాశపరుస్తుంది విషయం తెలిసింది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత పూర్తిగా క్రికెట్ కు దూరంగా ఉన్న మహేంద్రసింగ్ ధోని మళ్లీ జట్టులోకి వస్తాడు అనుకుంటే ఊహించని విధంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రాణిస్తాడు అని అభిమానులందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ధోనీ ఐపీఎల్ లో పేలవ  ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.



 ఐపీఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్ జట్టుగా రంగంలోకి దిగింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇక మొదటి మ్యాచ్ విజయంతో మొదలుపెట్టిన చెన్నై జట్టు ఆ తర్వాత మాత్రం వరుస ఓటములు చవి చూస్తూ వస్తోంది. దీంతో ధోనీ కెప్టెన్సీపై ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ధోని ఇప్పటికైనా ఆట తీరు మార్చుకోవాలని ఎంతోమంది మాజీలు సైతం స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది విదేశీ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వయసుతో సంబంధం లేకుండా ఆడుతుంటే... ధోని మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు అన్న విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.



 ఇప్పుడు వరకు ఐపీఎల్లో ఒక్కసారి కూడా తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు మహేంద్రసింగ్ ధోని. ఇలాంటి క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేక పోతున్న చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు మియాందాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ మ్యాచ్ కి  సరిపడే ఫిట్నెస్ మాత్రం లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని మ్యాచులలో సరైన ఫిట్నెస్ సాధించడం కోసం ఎక్కువసేపు వ్యాయామం చేయాలని అంతేకాకుండా నెట్స్ లో  ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయాలి అంటూ సూచించారు. తెలివితో ఆడితే వయసుతో సంబంధం లేదు అంటూ సలహా ఇచ్చాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మియాందాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: