ఐపీఎల్ సీజన్ లో టైటిల్ ఫేవరెట్గా రంగం లోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత మాత్రం వరుస ఓటములతో పేలవ ప్రదర్శనతో పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది చెన్నై. ప్రతి సీజన్లో ప్లే ఆప్ కు అర్హత సాధించిన ఏకైక జట్టుగా ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం ప్లే ఆఫ్ కి వెళ్తుందా అనే అనుమానాలను కలిగిస్తోంది.



 నిన్న రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా పూర్తిగా విఫలం అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరికి  ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో మరోసారి ధోని పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదని అందుకే ఇప్పటి వరకూ ఎక్కువ  అవకాశం ఇవ్వలేదు అని చెప్పుకొచ్చాడు. ధోని  వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగానే కామెంట్స్ చేశాడు.



 ధోని కి యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదు సరే.. కేదార్ జాదవ్, పియూష్ చావ్లా లాంటి ఆటగాళ్లలో ఏం స్పార్క్ కనిపించిందని తుది జట్టులోకి తీసుకున్నారు అంటూ ప్రశ్నించారు. ధోని గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ ప్రాసెస్ ను  నమ్ముతాను ధోని చెబుతున్న మాటలను  నేను అంగీకరించను.. ధోని ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాడు కానీ టీమ్ సెలక్షన్ విధానమే ఎంతో తప్పు అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా కేదార్ జాదవ్ పియూష్ చావ్లా లాంటి ఆటగాళ్లకు జట్టులో అవకాశం ఇవ్వడాన్ని తప్పుపట్టాడు కృష్ణమాచారి శ్రీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: