ఏడాది ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే ప్రతీ మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రేక్షకులందరినీ టీవీలకు అతుక్కుపోయేల  చేస్తుంది. ఐపీఎల్ సీజన్ లో తిరుగులేని జట్టుగా యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  అద్భుత ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఓసారి ఫైనల్కు చేరిన ఈ జట్టు టైటిల్ ని  ఒక్క అడుగు దూరంలో చేజార్చుకుంది కానీ ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలి అనే పట్టుదలతో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.



 ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రారంభం నుంచి ప్రతి మ్యాచ్లో కూడా అద్భుత ప్రదర్శన చేస్తూ బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో కూడా ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం సంపాదించి ఘన విజయాలు అందుకుంటూ పాయింట్ల పట్టికలో ఎప్పుడూ అగ్రస్థానంలో కొనసాగుతోంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. యువ ఆటగాడు అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఎంతో పరిణితి కనబరుస్తూ ఎంతో సమన్వయంతో సమతూకంతో  జట్టును ముందుకు తీసుకువెళుతూ అద్భుత విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యధిక విజయాలను సొంతం చేసుకున్న జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.



 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఎన్నో  ప్రశంసలు అందుకున్నాడు శిఖర్ ధావన్. నిన్న ఢిల్లీ కాపిటల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే . చివరి బాల్ వరకు ఎవరు గెలుస్తారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సెంచరీతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు శిఖర్ ధావన్ . ఐపీఎల్ చరిత్రలో రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: