ఈ ఏడాది ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన జట్లు పేలవ ప్రదర్శన చేస్తుంటే సాదాసీదాగా ఎలాంటి అంచనాలు లేని జట్లు అద్భుతంగా రాణించిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే స్టీవ్  స్మిత్  సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట ఎంతో అద్భుతంగా రాణించి వరుస విజయాలను సొంతం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు చెలరేగి ఆడిన తీరు చూస్తే ఈసారి తప్పకుండా కు  జట్టు ఫైనల్కు చేరుకుంటుంది అని అందరు అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం అదే ఫామ్  కొనసాగించ లేక పోయారు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు. వరుసగా పేలవ ప్రదర్శన చేస్తుండటంతో చివరికి ఓటమి పాలు కావలసి వచ్చింది.



 ఇక ఇటీవలే తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడం కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఓపెనర్లు కెప్టెన్ అంతగా రాణించక పోయినప్పటికీ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నా జోస్ బట్లర్ మాత్రం అద్భుతంగా రాణించి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకోవడమే కాదు జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అనే విషయం తెలిసిందే. అందరు ఆటగాళ్లు మైదానంలో పిచ్ ఆధారంగా ఆడటానికి ఇబ్బంది పడుతూ ఉంటే... బట్లర్ సిక్సర్లు ఫోర్లు వర్షం కురిపించాడు.



 తక్కువ బంతుల్లోనే భారీ స్కోర్ చేశాడు జోస్ బట్లర్. అయితే జట్టు అవసరాల కోసం తాను ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ తెలిపాడు. ఓపెనర్ గా రావడం తో పోలిస్తే మిడిలార్డర్లో ఆడటం ఎంతో భిన్నంగా ఉంటుంది అంటూ తెలిపిన జోస్ బట్లర్.. మిడిలార్డర్లో మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ మ్యాచ్ అవసరాల కోసం ఏ స్థానంలో నైనా ఆడేందుకు ప్రతి ఆటగాడు సిద్ధంగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ తరఫున మొదట ఓపెనింగ్ కి  దిగిన బట్టర్ జట్టులోకి బెన్ స్టోక్  రావడంతో ప్రస్తుతం మిడిలార్డర్లో వస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: