ఐపీఎల్ సీజన్ ఎంతో రంజుగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్  కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇక ఐపీఎల్ లో ఎంతో మంది క్రికెటర్లు అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న  ఢిల్లీ కాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బ్రేక్ వేసింది అని చెప్పాలి. కేవలం అతి తక్కువ విజయాలను సొంతం చేసుకొని... పాయింట్ల పట్టికలో అట్టడుగు ఉంటున్న  కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆ తర్వాత మాత్రం ప్లే ఆఫ్  ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు  వరుస విజయాలతో దూసుకుపోతుంది.


 ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లో విజయం తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా ఏకంగా మూడు విజయాలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఢిల్లీ కాపిటల్ జట్టులో  ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతంగా రాణిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు శిఖర్ ధావన్. ముఖ్యంగా వరుసగా రెండు మ్యాచ్లలో కూడా సెంచరీతో చెలరేగిన శిఖర్ ధావన్ అదరగొట్టారు అని చెప్పాలి. భారీ సిక్సర్లతో హోరెత్తించారు శిఖర్ ధావన్.



 ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా అద్భుతంగా సెంచరీ సాధించిన శిఖర్ ధావన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లి 5 వేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్ చేరిపోయాడు. ఐపీఎల్లో ఐదు వేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఇప్పటికే విరాట్ కోహ్లీ.. సురేష్ రైనా రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్ లు ఉండగా ఇప్పుడు శిఖర్ ధావన్ కూడా చేరిపోయాడు. అంతేకాదు ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు శిఖర్ ధావన్.

మరింత సమాచారం తెలుసుకోండి: