టీమిండియాలో డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా ఎడమచేతివాటం బ్యాట్స్మెన్గా శిఖర్ ధావన్ ప్రస్థానం ఎంతో అద్భుతంగా సాగింది అన్న విషయం తెలిసిందే. ఇండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఎన్నోసార్లు అద్భుత ఇన్నింగ్స్ తో  ఎన్నో రికార్డులు సృష్టించాడు శిఖర్ ధావన్. అయితే శిఖర్ ధావన్ మొదటిసారి టీమ్ ఇండియా జెర్సీ వేసుకుని దాదాపుగా ఈ రోజు కి పదేళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా శిఖర్ ధావన్ కి ఎంతో మంది క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు  అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శిఖర్ ధావన్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



 ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన శిఖర్ ధావన్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. టీమిండియా తో నా ప్రయాణం పదేళ్లు ముగిసింది... పదేళ్ల నుంచి నా దేశం కోసం ఆడుతున్నాను ఇంత కంటే గొప్ప గౌరవం ఇంకేమి ఉండదు.. నా మాతృభూమి కి ప్రాతినిధ్యం వహించడం నా జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది.. సదా అందరికీ నేను కృతజ్ఞుడిని అంటూ ఓ భావోద్వేగ పూరితమైన పోస్ట్ పెట్టారు శిఖర్ ధావన్. కాగా 2004 సంవత్సరంలో అండర్-19 ప్రపంచ కప్ లో 505 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు శిఖర్ ధావన్.



 ప్రపంచ కప్ టోర్నీ లోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. అయితే శిఖర్ ధావన్ ఎంతో అద్భుతమైన ప్రతిభ కనబరిచినప్పటికీ  ఆ సమయంలో భారత జట్టులో ఎంతో నాణ్యమైన ప్రతిభగల అనుభవంగల ఆటగాళ్లు ఉండడంతో ఆ సమయంలో సెలెక్టర్లు ఎక్కువగా శిఖర్ ధావన్ పై ఆసక్తి చూపలేదు. 2010 సంవత్సరంలో మాత్రం అక్టోబర్ 20వ తేదీన భారత వన్డే జట్టులో శిఖర్ ధావన్ కి అవకాశం దక్కడంతో  అరంగేట్రం చేశాడు. కానీ తొలి మ్యాచ్లోనే డకౌట్ అయిన శిఖర్ ధావన్... ఆ తర్వాత మాత్రం తనదైన దూకుడు ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి శిఖర్ ధావన్ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టీమిండియాలో డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా  తన  ప్రస్థానం కొనసాగిస్తున్నాడు శిఖర్ ధావన్.

మరింత సమాచారం తెలుసుకోండి: