దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన కీలక మ్యాచ్ లో ఢిల్లీ పై పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.

  ముందుగా బ్యాటింగ్ కు  దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ లో ధవన్ ఒక్కడే మళ్లీ తన జోరును కొనసాగించాడు.   తొలి ఓవర్ నుంచే బౌలర్లపై ఆధిపత్యం  సాధించాడు.   అయితే   మరో ఎండ్ లో ఇతర బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో జట్టు భారీ స్కోరు పై ప్రభావం పడింది.

 పంజాబ్ బౌలర్లు కూడా మధ్య ఓవర్లలో కట్టడి చేయగలిగారు. అటు ధవన్ మాత్రం పంజాబ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(14), పంత్(14), స్టోయినిస్(9) నిరాశపరచడంతో భారీ భాగస్వామ్యాలు ఏర్పడలేదు.

 చివరి వరకు క్రీజులో నిలిచిన ధవన్ 57 బంతుల్లోనే వరుసగా రెండో శతకాన్ని పూర్తి చేశాడు.
 ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్సమన్  శిఖర్ ధావన్....లక్ష్యఛేదనలో పంజాబ్ కు మూడు ఓవర్లలోనే ఎదురుదెబ్బ తగిలింది కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ని అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు .అయితే తుషార్ వేసిన ఇన్నింగ్స్ అయిదో ఓవర్లో క్రిస్ గేల్ (29) ఢిల్లీ కి చుక్కలు చూపించాడు వరుసగా 4,4,6,4 ,6 తో 26 పరుగులు రాబట్టాడు. కానీ మరుసటి ఓవర్లోనే అశ్విన్ వేసిన చక్కటి బంతికి గేల్ వికెట్  కోల్పోయాడు.

 దీనికితోడు సమన్వయం లోపంతో మయాంక్ అనవసరంగా రనౌట్ అయ్యాడు....అయితే మిడిలార్డర్లో పూరన్, మ్యాక్స్ వెల్ అదరగొట్టారు. పూరన్ 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన వెంటనే కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు.
 అప్పటికీ పంజాబ్ గెలవాలంటే  42 బంతుల్లో 35 పరుగులు మాత్రమే అవసరం. అనవసరమైన షాట్ కు వెళ్లి మ్యాక్స్ వెల్ కూడా వెనుదిరగడంతో ఉత్కంఠ పెరిగింది.
 కానీ చివర్లో నీషమ్ , దీపక్ హుడా ఇద్దరు కలిసి మ్యాచ ను  విజయంతో ముగించారు... దీంతో ఎనిమిది పాయింట్ల తో పంజాబ్  ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: