ఐపీఎల్ లో ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది . ఈ సీజన్ ఆరంభానికి ముందే సీఎస్కే కీలక ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ముందుగానే ఐపీఎల్ టూర్  నుండి తప్పుకున్నారు .ఆ తరువాత సీఎస్కే టీమ్ లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకింది .లీగ్ తొలి మ్యాచ్ లో ముంబైపై గెలిచిన   చెన్నైకు తరువాత వరుస ఓటములు ఎదురయ్యాయి.

 తాజాగా చెన్నై ఆల్రౌండర్ బ్రేవో కూడా తప్పుకున్నాడు. గజ్జల్లో గాయంతో టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు. మొదట కూడా బ్రేవో రెండు మూడు మ్యాచ్లు ఆడలేదు. శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో బ్రేవో బౌలింగ్ వేయలేక పోయిన విషయం తెలిసిందే.
 బ్రేవో త్వరగా కోలుకునే అవకాశాలు కనిపించడం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాశీవిశ్వనాథన్ మీడియాతో తెలిపారు.
 ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ అంతగా  రాణించలేకపోయింది అని పేర్కొన్నారు . రైనా ,బజ్జి ప్రభావం చూపిందని విశ్వనాథన్ అన్నారు .

 పియుష్ చావ్లా, కరణ్ శర్మ లు కూడా ఈ  ఏడాది  అంతగా  ప్రభావం  చూపలేకపోయారు . గత ఏడాది  అత్యధిక  వికెట్లు తీసిన  ఇమ్రాన్ తాహిర్ ను  బ్రేవో  స్థానంలో  తీసుకొనే  అవకాశం ఉంది . కేదార్  జాదవ్ కూడా వచ్చిన అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోలేకపోయాడు.   ప్లే ఆఫ్ రేసులో చెన్నై దాదాపు  లేనట్లే  . మిగిలిన మ్యాచ్ లో జూనియర్లకు అవకాశం ఇస్తారో వేచి చూడాలి మరి.  తాజాగా చెన్నై ఆల్రౌండర్ బ్రేవో కూడా తప్పుకున్నాడు. గజ్జల్లో గాయంతో టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు. మొదట కూడా బ్రేవో రెండు మూడు మ్యాచ్లు ఆడలేదు. శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో బ్రేవో బౌలింగ్ వేయలేక పోయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: