ఐపీఎల్ పోరు ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇక ప్రతి మ్యాచ్ కూడా ఎంతో అద్భుతంగా చివరి బాల్ వరకు ఫలితం ఏముంటుందో.. ఏ జట్టు విజయం సాధిస్తుందో అన్నది కూడా తెలియకుండా నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్న విషయం తెలిసిందే. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ అంతకుముందు మజా  దొరకదు అని ప్రేక్షకులు భావించినప్పటికీ టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకూ అంతకు మించి అనే విధంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ లో  కూడా ఎంటర్టైన్మెంట్ అందుతోంది.




 ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ మినహా మిగతా అన్ని జట్లు కూడా ఐపీఎల్ ఫోర్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే మొన్నటి వరకు వరుస పరాజయాలు చవిచూసిన జట్లు  సైతం ప్రస్తుతం ప్లే ఆశలను సజీవంగా ఉంచుకుని  ప్లే ఆఫ్ కు అర్హత సాధించేందుకు వరుస విజయాలను నమోదు చేస్తూ అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఉండడంతో ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ మరింత డబుల్ అయింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కరోనా వైరస్  కారణంగా భారత్లో కాకుండా యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసిసి నిబంధనల మధ్య ప్రస్తుతం ఆటగాళ్లందరూ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నారు.




 అయితే ఐపీఎల్ లో భాగంగా కొన్ని మ్యాచ్ లలో  కొందరు ఆటగాళ్లు రెండు టోపీలు పెట్టుకుని కనిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇంతకీ ఆటగాళ్లు రెండు టోపీలు ఎందుకు పెట్టుకున్నారు అని అనుమానం టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులందరిలో కూడా కలిగే  ఉంటుంది. వాళ్లు అలా రెండు టోపీలు పెట్టుకోవడానికి వెనుక పెద్ద కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా  నిబంధనలు కారణంగానే ఆటగాళ్లు అలా రెండు టోపీలు పెట్టుకున్నట్లు సమాచారం. ఆటగాళ్లు తమ టోపీలు సన్ గ్లాసెస్ టవల్స్ లాంటివి అంపైర్ల కు ఇవ్వడానికి ఐసిసి నిబంధనల ప్రకారం వీలులేదు. దీంతో బౌలర్లు బౌలింగ్ చేసే సమయంలో అంపైర్ల కు వారి వస్తువులు ఇవ్వకుండా ఇతర ఆటగాళ్ళ తలపై నేరుగా పెట్టి బౌలింగ్ ముగియగానే తలపై ఉన్న టోపీ తీసుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: