ఐపీఎల్లో దిగ్గజ టు గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ  ఐపీఎల్ సీజన్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పేలవ  ప్రదర్శనతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ముఖ్యంగా ఏడాదిన్నరపాటు క్రికెట్కు దూరమైన మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో రాణిస్తాడు అనుకుంటే ప్రతి మ్యాచ్లో కూడా పేలవ ప్రదర్శనతో మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ జట్టుగా పేరు సంపాదించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు ఒక చేదు అనుభవం ఎదురైంది అని చెప్పాలి.



 పాయింట్ల పట్టికలో ఎప్పుడు అగ్రస్థానంలో కొనసాగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం వరుస ఓటమిల చవి చూస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగు మూలుగుతోంది. కనీసం ఒక మ్యాచ్  అయినా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారు అని అభిమానులు ప్రతి మ్యాచ్ ముందు  కూడా వెయ్యి కళ్ళతో టీవీల ముందు కూర్చుని ఎదురు చూస్తూ ఉంటే ప్రతి మ్యాచ్లో కూడా అంతకంతకు పేలవ  ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నది . ముఖ్యంగా ధోని జట్టు సెలక్షన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకుండా ఎప్పుడూ విఫలం అయ్యే  కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లకు వరుసగా జట్టులో అవకాశాలు ఇవ్వడం పై ధోనిపై మాజీలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.



 ఇక నిన్న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా నిన్న మరింత పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇక కేవలం పవర్ ప్లే ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టు ఐపీఎల్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. పవర్ ప్లే ముగిసేలోపే ఐదు వికెట్లు కోల్పోయిన మూడో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 24 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన జట్టుగా చెన్నై జట్టు ఈ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఇందులో మొదటి ప్లేస్లో బెంగళూరు జట్టు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: